Thursday, May 16, 2024
- Advertisement -

బాబ్బాబు…రెండు నిమిషాలే స్నానం చేయండి…భార‌త ఆట‌గాల్ల‌కు విన్న‌వించ‌కున్న సౌతాఫ్రికా..

- Advertisement -

శుక్ర‌వారంనుంచి కేప్‌టౌన్‌ లో జ‌ర‌గ‌నున్క‌న మొద‌టి టెస్ట్‌లో స‌ఫారీల‌తో ఢీకొట్టేందుకు భార‌త్ జ‌ట్టు సిద్ద‌మ‌య్యింది. అయితే భార‌త ఆట‌గాల్ల‌కు వింత స‌మ‌స్య ఎద‌ర‌య్యింది. అదేంది అనుకుంటున్నారా. ప్ర‌ధానంగా నీటి కొర‌త ఏర్ప‌డింది. దీంతో భార‌త ఆట‌గాల్ల‌ రెండు నిమిషాలు మాత్రమే స్నానం చేయాలని కోహ్లీ సేనకు దక్షిణాఫ్రికా సూచించిందట.

కేప్‌టౌన్‌లో నీటి సమస్య ఎక్కువగా ఉన్నందున టీమిండియా ఆటగాళ్లకు రెండు నిమిషాల కంటే ఎక్కువ సమయం స్నానం చేయవద్దని స్థానిక అధికారులు కోరారట. దీంతో ఆటగాళ్లు ఎప్పుడు స్నానం చేసినా రెండు నిమిషాలలోపే వచ్చేస్తున్నారట.

దీనిపై ఓ మీడియా సంస్థ టీమిండియాలో ఓ ఆటగాడిని ప్రశ్నించగా.. ‘మేము మ్యాచ్‌లు ఆడేందుకు వచ్చాం. బాగా ఆడాలి. విజయాలు సాధించాలి. అంతే మిగతా వాటి గురించి పట్టించుకోవల్సిన అవసరం లేదు’ అని బదులిచ్చాడట. ప్రతి రోజూ ప్రాక్టీస్‌ అనంతరం ఆటగాళ్లు షవర్ల కింద కాసేపు సేద తీరేందుకు అవకాశం లేకపోయిందని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.

దక్షిణాఫ్రికాలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే కేప్‌టౌన్‌ను నీటి సమస్య బాగా వేధిస్తోంది. నీరు సరిపడా లేకపోవడంతో పిచ్‌పై పచ్చికను పెంచే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని న్యూలాండ్ క్యూరేటర్ ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేశాడు. టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌ల కోసం దక్షిణాఫ్రికా చేరుకున్న కోహ్లీ సేన శుక్రవారం తొలి టెస్ట్ ఆడనుంది. ఈ సిరీస్‌ కోసం టీమిండియా గత వారమే సఫారీ గడ్డపై అడుగుపెట్టింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -