- Advertisement -

ఇలియానా.. ఇలాంటి గాసిప్పులతోనే అనుకొన్నది సాధిస్తుందా!

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీతో ఆమెకు టచ్ పోయింది. అవకాశాలు బాగానే ఉన్న సమయంలో ఆమె బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ మత్తులో సినిమా చాన్సులను వదిలేసుకొంది.

చేజేతులారా టాలీవుడ్ కెరీర్ ను నాశనం చేసుకొంది. మరి ఇప్పుడు ఇలియానాకు తిరిగి తెలుగులో అవకాశాలను సంపాదించుకోవాలని.. సౌత్ లో బిజీ అయిపోవాలనే ఆశలు మొదలయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో ఆమె ఆసక్తికరంగా వార్తల్లోకి వస్తోంది.

మొదటగా ఆమె అక్కినేని అఖిల్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయనుందనే వార్తలో అందరి అటెన్షన్ నూ తీసుకొచ్చింది. అయితే ఆ విషయంలో ఇప్పటి వరకూ కన్ఫర్మ్ లేదు. ఆ తర్వాత ఆమె తమిళ దర్శకుడు శంకర్ తో సన్నిహితంగా మెలుగుతోందనే వార్తలు గుప్పు మన్నాయి. శంకర్ తో తను ఒక గెస్ట్ హౌస్ లో మీట్ అయ్యిందనే వార్తలు సంచలనంగా మరాయి. అయితే అదంతా ఒక సినిమా చర్చ కోసమే అని తర్వాత వివరణ ఇచ్చుకొన్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె రాంచరణ్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఏకంగా  కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొంటూ ఇలియానా ఆ సినిమాలో ఐటమ్ పాటకు నర్తించబోతోందనే అంటున్నారు. మరి ఇది ఎంత వరకూ నిజమో కానీ.. ఇలాంటి పుకార్లు మాత్రం ఇలియానాను తిరిగి దక్షిణాది ప్రేక్షకులకు దగ్గర చేసేలా ఉన్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -