Tuesday, May 14, 2024
- Advertisement -

హిందుత్వవాద మోడీ మసీదుకు వెళ్లాడోచ్..!

- Advertisement -

భారతీయ జనతా పార్టీ హిందుత్వ వాద పార్టీ అని వేరే చెప్పనక్కర్లేదు.తాము మతతత్వ రాజకీయాలకు దూరంగా ఉంటామని ఈ పార్టీ వాళ్లు చెబుతూ ఉంటారు.

హిందుత్వవాద పక్షపాతులుగా ఉంటారు. అలాగే మైనారిటీ అనుకూల రాజకీయాలు చేయడం తమకు నచ్చదని చెబుతూ ఉంటారు. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన సగటు రాజకీయా నేతలు వేసేవేషాలను అస్సలు వేయడు.

ఎన్నికల ప్రచార సభల్లోనూ… ఇతర సందర్భల్లోనూ ఎవరైనా ముస్లింలు తనకు టోపీ పెట్టడానికి వస్తే దాన్ని మోడీ తిరస్కరిస్తాడు. ముస్లింలు పెట్టుకొనే స్కల్ క్యాప్ ను పెట్టుకోవడానికి గతంలోనే నిరాకరించాడు నరేంద్రమోడీ. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా మసీదుకే వెళ్లడం విశేషం. ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్న భారత ప్రధాని అక్కడి  షేక్ జాయేద్ గ్రాండ్ మసీదును సందర్శించాడు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మసీదు అయిన దీన్ని ఆయన సందర్శించాడు.

ఇప్పటికే ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేశారు. మోడీ ఈ విదంగా మసీదుకు వెళ్లడమే మంచిదని వారు అంటున్నారు. విదేశీ పర్యటన కాబట్టి.. ఇది మత రాజకీయం కాదు అని.. దౌత్య సంబంధాల కోసమే మోడీ ఇలా మసీదును సందర్శించడాని చెప్పుకోవదానికి బీజేపీ నేతలకు అవకాశం ఉంటుంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -