Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ తో మహేష్ ఫైట్ చేయాల్సిందేనా…?

- Advertisement -

మహేష్ ఎవ్వరికీ పోటీ కాదని ఎంత చెప్పినా…మెగా కాంపౌండ్ మాత్రం ఒపుకోవడం లేదు. రెండో స్సారి కూడా ప్రిన్స్ కు ఝలక్ ఇవ్వాలనే చూస్తోంది. అయితే దీనికి వచ్చే సమ్మర్ ను  వేదికగా చేసుకుంది.

మరి సమ్మర్లో పవన్ ను మహేష్ ఎంత వరకు ఫేస్ చేయగలడనేది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే గతంలో కూడా మహేష్ మెగా హీరో చెర్రీతో పొంగల్ టైమ్ కు పోటీ పడి పరాజయం పాలయ్యాడు. దాన్ని మహేష్ లైట్ తీసుకున్నా…మహేష్ ఫ్యాన్స్ మాత్రం సీరియస్ గానే తీసుకున్నారు.కాని ఇప్పటి వరకు ఆ పగ తీర్చుకునే సందర్బం రాలేదు. అయితే ఈసారి బ్రహ్మోత్సవంతో ప్రిన్స్ వేసవికి వస్తున్నాడు. అది కూడా ఏప్రిల్ 8న .

దీనికి వారం తర్వాత అనగా ఏప్రిల్ 15న సర్దార్ తో పవన్ వస్తున్నాడు. మహేష్ నుంచి డేట్ కన్ఫామ్ చేసేసుకున్నా…పవన్ నుంచి ఎక్జాట్ డేట్ 15 అనే అఫీషియల్ గా కన్ఫామ్ కాలేదు.

ఒక వేల ఇద్దరి డేట్లు ఇవే అయితే మాత్రం…. ఫైట్ మాంచి రసవత్తరంగా ఉండే అవకాశముంది. మరి ఈసారి కూడా మెగా కాంపౌండ్ ప్రిన్స్ పై విజయ ఢంకా మోగిస్తుందో లేక ప్రిన్స్ చేతిలో బొక్కబోర్లా పడుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -