Sunday, May 5, 2024
- Advertisement -

అమరావతి శంకుస్థాపనకు నేను రాను..ఆహ్వానం వద్దన్న జగన్..

- Advertisement -

అమరావతి శంకుస్థాపనకు నేను రాను అని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు.

 తాను రాకపోవడానికి ఎనిమిది కారణాలున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానెల్ తో ఆయన మాట్లాడారు.

ఆ లేఖలో ఏమున్నాయో చూద్దాం..

  • రైతుల భూములు బలవంతంగా భూములు లాక్కొని వారి ఉసురు మీద రాజధాని కడుతున్నారు. దీనిపై పలు సందర్భాల్లో దీక్షలు చేసినా స్పందించలేదు.
  • రాజధాని ప్రాంతంలో సెక్షన్ 30, సెక్షన్ 144ని ఎందుకు అమలు చేస్తున్నారు. ప్రజలు ఆనందంగా ఉంటే ఈ సెక్షన్లు ఎందుకు అమలు చేస్తున్నారు ?
  • గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును బేఖాతర్ చేస్తూ కోర్టును, ప్రజల మనోభావాలను రెండిటినీ లెక్క చేయడం లేదు.
  • అసెన్డ్ భూములు, పేదల భూములును మీ ఇష్టం వచ్చినట్లు ఆక్రమించుకుంటున్నారు.
  • నచ్చిన ప్రైవేటు, విదేశీ సింగపూర్ కంపెనీలకు భూములు కేటాయిస్తున్నారు. కమీషన్ల కోసం..లంచాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.
  • కేంద్రం రూ.1850 కోట్లు రాజధాని కోసం డబ్బులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా చేస్తామని పేర్కొంటోంది. రాష్ట్రానికి కేంద్రం సహాయం చేస్తుందని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ప్రైవేటు సింగపూర్ కంపెనీలు..ప్రైవేటు విదేశీ కంపెనీలతో ఏం పని ?
  • కొంతమంది బినామీలు రాజధాని ప్రాంతంలో వందల ఎకరాలు కొనుగోలు చేయించి, వారి భూములు వదిలేసి పేదల భూములు మాత్రం ఇష్టం లేకపోయినా లాక్కొన్నారు.
  • ప్రజల డబ్బును దుబారా చేస్తూ ఒక్కరోజు తతంగాన్ని జరిపేందుకు దాదాపు రూ.400 కోట్లు బూడిదపాలు చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -