Wednesday, April 24, 2024
- Advertisement -

OTT లకు సంక్షోభం.. అన్ని ఫ్లాప్ సినిమాలే.. సూర్య..?

- Advertisement -

కరోనా కాలంలో థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో సినిమాలు కంప్లీట్ చేసుకుని ఉన్న నిర్మాతలకి దైవంలాగా OTT లు అవతరించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.. వీటి పుణ్యయన కొత్త సినిమాలు రిలీజ్ కావడమే కాదు ఎప్పటినుంచో రిలీజ్ లకు నోచుకోని సినిమాలు కూడా రిలీజ్ అయ్యి కొంత డబ్బు సంపాదించాయి. అయితే OTT ల వల్ల ఎవరికీ లాభం చేకూరిందో తెలీదు కానీ ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలు అన్ని ఎక్కువ నడవలేదు అని చెప్పాలి. దాదాపు అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అని చెప్పాలి.. తొలుత OTT లో రిలీజ్ కావడానికి నాని వి సినిమా ముందుకు రాగ ఆ సినిమా ఫలితం ఎలా ఉందొ అందరికి తెలిసిందే..

ఎదో దిల్ రాజు మంచి ఆఫర్ వచ్చిందని సినిమాను OTT లో రిలీజ్ చేశాడు తప్పితే అందులో నాని లాంటి హీరో సినిమా రిలీజ్ చేయడం ఆయనకు పెద్దగా ఇష్టం లేదు.. అమెజాన్ ప్రైమ్ కూడా ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా సినిమాలు కొనుక్కుని రిలీజ్ చేసింది. నాని వి, అనుష్క నిశబ్దంలకు కనివిని ఎరుగని రీతిలో డీల్స్ కుదుర్చుకుంది. అయితే రెండింటికి నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. సోషల్ మీడియాలో నెగటివ్ ఫీడ్ బ్యాక్ తో నెటిజెన్స్ ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేసేశారు. నిన్న రాత్రి వచ్చిన నిశ్శబ్దం గురించి గట్టిగా సౌండ్ చేసి మరీ ఇదేం సినిమా అని గట్టిగానే ఆడుకుంటున్నారు. థియేటర్లలో వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడం కూడా కష్టమే.

ఇప్పుడు ప్రైమ్ ను ఆదుకోవాలంటే ఒక మంచి సినిమా పడాలి.. అప్పుడే సబ్ స్క్రైబ్ర్లు పెరుగుతారు. లేదంటే అమెజాన్ తొందర్లోనే మూసుకోవాల్సి వస్తది.. హిందీలో వెబ్ సిరీస్ రూపంలో అలాంటివి వస్తున్నాయి కానీ సౌత్ నుంచి మాత్రం ఇప్పటిదాకా ఏమి లేవు. అందుకే ప్రైమ్ ఇప్పుడు ఆశలన్నీ సూర్య ఆకాశం నీ హద్దురా మీదే పెట్టుకుంది. ఎయిర్ డెక్కన్ అధినేత గోపి నాధ్ బయోపిక్ గా రూపొందిన ఈ సినిమాకు గురు ఫేమ్ సుధా కొంగర దర్శకురాలు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ కీలక పాత్ర పోషించారు.  ఈ సినిమా పై ప్రేక్షకులతో పాటు అమెజాన్ కూడా మంచి అంచనాలు పెట్టుకుంది.  ఎనభై కోట్ల దాకా ప్రైమ్ ఆఫర్ చేసిందని టాక్ ఉంది ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. సినిమా మంచి గ ఉంటె పర్వాలేదు కానీ తేడా కొడితే మాత్రం అమెజాన్ ఎలా కోలుకుంటుందో చూడాలి..

‘ఒరేయ్ బుజ్జిగా’ మూవీ రివ్యూ..!

’నిశ్శబ్దం’ మూవీ రివ్యూ

బిగ్ బాస్ హౌస్ లో కాస్టింగ్ కౌచ్.. చెప్పుతో కొట్టాలి : కళ్యాణి

దివి ప్రేమించిన అబ్బాయిని ఎందుకు వదిలేసిందో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -