Friday, April 19, 2024
- Advertisement -

35 ఏళ్లు దాటిన ఇంకా పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

- Advertisement -

ఈ నెల 30వ తేదీన తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును కాజల్ పెళ్లి చేసుకోబోతుంది. ఇన్నాళ్ళు కెరీర్ లో బిజీ గా ఉండటం వల్ల పెళ్లి చేసుకోలేదు. మొత్తానికి 35ఏళ్లు దాటాక స్నేహితుడిని పెళ్లాడేందుకు సిద్ధమైంది. అయితే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో 30-35 ఏళ్లు దాటి ఇంకా పెళ్లి చేసుకోని హీరోయిన్లు చాలామంది ఉన్నారు.

ప్రస్తుతం అనుష్కకు 38ఏళ్లు నిండాయి. ఇంకా పెళ్లి చేసుకోలేదు. నవంబర్ 7తో 40వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. అనుష్క తర్వాత మోస్ట్‌ ఎలిజిబుల్‌ స్పినిస్టర్‌ త్రిష. ప్రస్తుతం ఆమెకు 37 ఏళ్ళు నిండాయి. గతంలో వ్యాపారవేత్త వరుణ్‌ మణియన్‌తో నిశ్చితార్థం చేసుకున్న త్రిష.. కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పింది. అప్పటి నుంచి త్రిష మళ్లీ పెళ్లి ఊసే ఎత్తలేదు. ఇక నయనతార (35), శ్రుతిహాసన్‌ (34), ఇలియానా (33) జీవితాల్లో పెళ్లి గురించి మాటే లేదు.

హీరో శింబుతో ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపిన నయనతార వాళ్లతో విడిపోయింది. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో ఉంది. తెలుగమ్మాయి అంజలి (34), తాప్సీ (33), నిత్యా మీనన్‌ (32), రాయ్‌ లక్ష్మి (31) కూడా మూడు పదులు దాటినవాళ్లే. అయినప్పటికీ జీవిత భాగస్వామి గురించి ఆలోచించకుండా ఇంకా కెరీర్‌పైనే ఫోకస్ పెడుతున్నారు.

‘బిగ్ బాస్4’ ఇంటి సభ్యుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

బిగ్ బాస్ లో వినిపించే వాయిస్ ఇతనిదే..!

థియేటర్స్ ఓపెన్.. విడుదలకు రెడీ గా ఉన్న సినిమాలు ఇవే..!

ఒక్క నిమిషానికి ముఖేష్ అంబానీ ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -