Wednesday, May 1, 2024
- Advertisement -

సీనియర్ హీరోయిన్ మూడవ పెళ్లి రూమర్ లు ?

- Advertisement -

సినిమాలు చేతిలో లేక సీరియల్స్ చేస్తున్న సీనియర్ హీరోయిన్ సంఘవి ఈ మధ్య కాలం లో ఎక్కువగా డాన్స్ షో లతో పాపులర్ అయ్యింది. పాత సినిమాల్లో బాలకృష్ణ పక్కనా , చిరంజీవి పక్కనా అదరగొట్టే డాన్స్ లు వేసిన ఆమె ఇప్పుడు లేటు వయసులో కూడా హాటు డాన్సులతో ఆదరకోట్టింది అన్నవారు ఉన్నారు.

సినిమాల నుంచి అప్పట్లో వెళ్ళిపోయినా సంఘవి కి రెండు సార్లు పెళ్ళిళ్ళు అయ్యాయి అని రూమర్లు వచ్చాయి.2012 లో అమెరికా లో ఉన్న ఒక కన్నడ డాక్టర్ ని పెళ్లి చేసేసుకుంది అని మీడియా కోడై కూసింది. కానీ అలాంటిదేమీ జరగలేదు అని ఆమె తరవాత చెప్పింది. కొన్నాళ్ళ తరవాత సంఘవి కి బెంగళూరు లో ఒక సంబంధం ఓకే అయ్యింది అని వార్తలు వచ్చాయి. 

2013 లో  ఈమె పెళ్లి అయ్యింది అని అంతా అన్నారు కానీ ఆ రెండు సార్లూ ఆమె ఈ విషయం కొట్టి పారేసింది. కట్ చేస్తే ఇవాళ మళ్ళీ ఆమె పెళ్లి పుకార్లు షికారు చేస్తున్నాయి. బెంగుళూరులోని ఒక ఐటి కంపెనీకి చెందిని సి.ఇ.ఓ ను ఈమె తాజ్ వివాంటా హోటల్ లో పెళ్ళాడేసింది అనేది రూమర్ సారాంశం. మరి ఈసారైనా పెళ్ళి కథ గాలి వార్తగా మిగిలిపోతుందా.. లేదా నిజంగానే నిజమవుతుందో చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -