Sunday, April 28, 2024
- Advertisement -

హోల్ సెల్ గా అభిమానులను బురిడీ కొట్టించిన డాక్టర్ బాబు?

- Advertisement -

బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ పాత్రలో నటిస్తున్నటువంటి పరిటాల నిరుపమ్ ఎంతటి ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా బుల్లితెర శోభన్ బాబు అనే పేరును సైతం సంపాదించుకున్నారు. నిరుపమ్ గతంలో ఎన్నో సీరియల్స్ లో నటించిన ప్రస్తుతం ఎన్నో సీరియల్స్ లో నటిస్తున్నప్పటికీ కార్తీకదీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబుగా అందరికీ సుపరిచితం అయ్యారు.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తమ మీద, తమ సీరియల్ మీద వచ్చే ట్రోల్స్,మీమ్స్‌ను షేర్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదిక సెలబ్రిటీలు అందరూ ఆటలు ఆడుతున్నారు. మనం చిన్నప్పుడు క్విజ్ ఆడుతూ ఒక ప్రశ్నలు వేస్తూ సమాధానం తెలుసా లేదా అంటూ ఆడేవారు అచ్చం అలాంటి ఆటనే ప్రస్తుతం సెలబ్రిటీలు ఆడుతూ చాలెంజ్ విసురుకుంటున్నారు. 

Also read:మళ్లీ పెళ్లికి సిద్ధమైన బిగ్ బాస్ నోయల్..?

ఇందులో భాగంగానే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఓడిపోయిన వారు తమ స్టేటస్లో ఆ విషయాన్ని తెలియజేస్తూ మరొకరికి చాలెంజ్ విసరాలి. ఈ క్రమంలోనే నిరుపమ్ కూడా ఓ ప్రశ్న అడిగారు. ఈ క్రమంలోనే దీనికి మీరు సమాధానం చెప్పగలరా..?మీరు పడుకున్నారు కానీ మీకు బాగా ఆకలి వేస్తుంది ఆ టైంలో మీ ఫ్రిజ్ లో బటర్, చీజ్, జ్యూస్ అన్నీ ఉన్నాయి మీరు ఫస్ట్ ఓపెన్ చేసేది ఏంటి? అనే చిలిపి ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నకు వెన్నెల కిషోర్ తాను ఓడిపోయానని సమాధానం.

Also read:స్పీడ్ మీదున్న తారక్.. ఉప్పెన దర్శకుడితో సంప్రదింపులు?

మరికొందరు సమాధానం చెబుతూ కళ్ళు, ఫ్రిడ్జ్ అని తెలిపారు. అయితే ఆ సమాధానాలన్నీ తప్పేనని అసలు సమాధానం ఏదో తనే చెబుతానని ఒక టైం ఫిక్స్ చేశారు. చివరికి సమాధానం చెబుతూ అక్కడ అడిగింది మీరు సమాధానం చెప్పగలరా? అని మాత్రమే ..తెలిస్తే చెప్పగలరు లేదంటే లేదని పెట్టాలి కానీ ఫ్రిడ్జ్ డోర్, కళ్లు అని చెబితే తప్పు అని తన చిలిపి ప్రశ్నతో అందరిని బకరాలు చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -