Saturday, May 4, 2024
- Advertisement -

ఇవాంకాకు చీర‌ ఎంపిక చేసిన స‌మంత

- Advertisement -
  • గొల్ల‌భామ చీర‌ఎంపిక

ప్ర‌పంచ పారిశ్రామికవేత్త‌ల స‌ద‌స్సు కోసం హైద‌రాబాద్‌కు వ‌స్తున్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప‌ర్య‌ట‌న‌కు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఆమెకు రెడ్ కార్పెట్ వేసి ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు భార‌త ప్ర‌భుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత రాజ‌ధాని హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న తొలి అంత‌ర్జాతీయ స‌ద‌స్సు ఇది. ఈ స‌ద‌స్సును తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రానికి స‌హ‌క‌రిస్తూ తెలంగాణ విశేషాల‌ను చాటేలా ఏర్పాట్లు చేసింది. భార‌త గ‌డ్డ‌పై అది తొలిసారి హైద‌రాబాద్‌లో అడుగుపెడుతున్న ఇవాంకాకు ఎల్ల‌ప్పుడూ గుర్తుండిపోయే ప‌ర్య‌ట‌న‌గా ప్ర‌భుత్వం ఆలోచ‌న‌లు చేస్తోంది.

అందులో భాగంగా ఇవాంకాకు భారీ కానుక‌లు, దిమ్మ‌తిరిగిబోయే బ‌హుమానాలు ఇవ్వాల‌ని నిశ్చ‌యించుకుంది. ఇప్ప‌టికే ఆభ‌ర‌ణాలు కూడా సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇవాంకాకు చేనేత చీర ఇచ్చి చేనేత రంగం గురించి ప్ర‌పంచానికి చాటేలా ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తోంది. తెలంగాణ చేనేత బ్రాండ్అంబాసిడ‌ర్ ఉన్న అక్కినేని కోడ‌లు, న‌టి స‌మంత‌కు చేనేత చీర ఎంపిక బాధ్య‌త ఇచ్చార‌ట‌. స‌మంత సిద్ధిపేట జిల్లాకు చెందిన గొల్ల‌భామ చీర‌ను ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ చీర‌లో ఇవాంకా మెరుస్తుంద‌ని భావిస్తుంద‌న్నారు. ట్రంప్ కూతురు భార‌త సంస్కృతి అయిన చీర‌ను బ‌హుక‌రిస్తే త‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మ‌రువ‌లేద‌ని ఆలోచ‌న‌లో ఉన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -