Friday, May 17, 2024
- Advertisement -

రెండో టెస్ట్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం…

- Advertisement -

విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు అతిపెద్ద టెస్టు విజయం సాధించింది. విదర్భ క్రికెట్‌ సంఘం మైదానంలో శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 239 పరుగుల తేడాతో విజయం కైవసం చేసుకుంది. రాహుల్‌ ద్రవిడ్‌ సేన 2007లో బంగ్లాదేశ్‌పై సాధించిన ఇన్నింగ్స్‌ 239 పరుగుల రికార్డును కోహ్లీసేన సమం చేసింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 21/1తో నాలుగోరోజు, సోమవారం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను భారత బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (4), ఇషాంత్‌ శర్మ (3), రవీంద్ర జడేజా (3) దెబ్బకు లంచ్‌ విరామం తర్వాత చండిమాల్‌ సేన 205 పరుగులకు ఆలౌటైంది. కోహ్లీసేన మరొక్క పరుగు ఆదా చేసివుంటే భారత క్రికెట్‌ చరిత్రలోనే అతిపెద్ద విజయం సొంతం చేసుకొని ఉండేది.

భార‌త్ తొలి ఇన్నింగ్స్ 610/6 వ‌ద్ద‌ డిక్లేర్డ్ చేసిన విష‌యం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ 205కే ఆలౌటైన శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లోనూ ఏ మాత్రం రాణించ‌లేక‌పోయింది. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక‌ 166 ప‌రుగుల‌కే ఆలౌట్ కావ‌డంతో భార‌త్‌ ఇన్నింగ్స్, 239 ప‌రుగుల‌ తేడాతో విజ‌యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త ఆట‌గాళ్లలో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ శ‌త‌కాలు, కోహ్లీ ద్విశ‌త‌కం న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. భార‌త టెస్ట్ చ‌రిత్ర‌లోనే కోహ్లీ సేన అతి పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -