Sunday, May 12, 2024
- Advertisement -

పదవ తరగతి పాప కి నలభై ఏళ్ల వ్యక్తి తో పెళ్లి !

- Advertisement -

కడపజిల్లా లో పదవ తరగతి చదువుతున్న బాలిక కి  ఎవరూ చూడకుండా ఇవాళ ఉదయం నాలుగు గంటలకి పెళ్లి చెయ్యడానికి అంతా సిద్దం చేసారు. ఆ సమయం లో అనుకోని రీతిలో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ పెళ్లిని అడ్డుకున్నారు. 

కువైట్ కి చెందిన నలభైఏళ్ళ వ్యక్తి తో పెళ్లి చెయ్యడం తనకి ఇష్టం లేదు అని పాప ఎంతగా చెబుతున్నా వినకుండా ఇవాళ తెల్లవారు జామున బలవంతగా ముహూర్తం నిశ్చయించారు కాగా స్థానికులు ఈ విషయం లో బాల్య వివాహం నేరం అని గొడవ చేసారు.

ఈ క్రమం లో బాలిక తల్లి తండ్రులతో స్థానికులు ఘర్షణ పడ్డారు తరవాత పోలీసులకి ఫిర్యాదు చెయ్యడం తో వారు రంగం లోకి దిగి పాపని కాపాడారు. 

పోలీసులు తల్లి తండ్రులతో పాటు చిన్న పిల్ల మెడలో తాళి కట్టడానికి సిద్దం అయిన ఆ నలభై ఏళ్ల వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కౌన్సిలింగ్ ద్వారా తల్లి తండ్రులకి విషయం వివరిస్తారు 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -