Saturday, April 27, 2024
- Advertisement -

అడ్డంగా రూ.8 కోట్ల హెరాయిన్ తో బుక్..!

- Advertisement -

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అసోం పోలీసులు మరో విజయం సాధించారు. హెరాయిన్​ సహా రూ.8 కోట్ల విలువైన నిషేధిత మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ అసోం జిల్లాలోని కొంతమంది అనుమానిత వ్యక్తులపై కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు.

పక్కా ప్రణాళికతో ఆదివారం సోదాలు నిర్వహించగా మాదకద్రవ్యాల వ్యవహారం బయటపడింది. 2 కిలోల హెరాయిన్​, 10 కిలోల అఫింగ్​, క్వింటాల్​ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల మధ్య ఉంటుందని తెలిపారు. దింగ్​ రెవెన్యూ పరిధిలోని సోనారిగావ్​లో హబిల్​ అలీ ఇంట్లో ఇవి బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో హబిల్​ అలీ, మొఫిదుల్​ హాక్​, బహదుల్​ అలమ్​ అనే ముగ్గురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -