Tuesday, April 30, 2024
- Advertisement -

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారో… వారితో బలవంతంగా ముద్దులే

- Advertisement -

ప్రభుత్వాలకు మనుషుల ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదు. అందుకే నిత్యం ప్రజల ప్రాణాల కాపాడటంలో ప్రభుత్వాలు తగు సూచనలు చేస్తుంటాయి. కాని కొందరు వాటిని పట్టించుకోకుండా ఎన్ని హెచ్చరికలు చేసినా ఖాతరు చేయకుండా చేయాల్సిన తప్పులు చేస్తూనే ఉంటారు. పైగా తప్పు జరిగితే ప్రభుత్వ అధికారులను నిందిస్తుంటారు. దీనిని ఓవర్ కమ్ చేయడం కోసం అధికారులు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. దానిలో భాగంగా అనంతపురం ట్రాఫిక్ పోలీసులు ఓ మంచి పని చేశారు.

అనంత ట్రాఫిక్ పోలీసులు…. రోడ్డు యాక్సిడెంట్ల నివారణకై ఎప్పటికప్పుడు ట్రెండ్ క్రియేట్ చేస్తూనే వున్నారని చాలామందికి తెలియదు. ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని చెబుతూ …. ఇప్పటికే బైకర్స్ కి చేతులెత్తి చాలాసార్లు దణ్ణం పెడుతూ వార్తల్లోకెక్కిన మడకశిర ఇన్స్ పెక్టర్ శుభకుమార్.. ఇప్పుడు మరో కొత్తరకం సీక్వెన్స్ కి తెరతీసారు. మీ ప్రాణం మీ డ్రైవింగ్ లోనే వుంది.. మీ కుటుంబం మీమీదే ఆధారపడి వుంది అంటూ తాము చెబితే జనం పట్టించుకోవడం లేదని.. ఈసారి హిజ్రాలను ఫీల్డ్ లోకి దించారు.

ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. ప్రాణాలు కాపాడుకోండి అంటూ హిజ్రాల చేతికి మైకులిచ్చిమరీ చెప్పిస్తున్నారు. ఇంత చెప్పినా వినకపోతే.. హెల్మెట్ ధరించకుండా తిచేసే కుర్రకారును ఆపి రోడ్డు మీద అందరు చూస్తుండగానే హిజ్రాలతో ముద్దులు పెట్టించే సాహసానికి ఒడిగట్టారు. ఇది ఒక రకంగా చాలా ఇబ్బందికరంగా అనిపించే సమస్యే అయినప్పటికీ తప్పదంటున్నారు శుభకుమార్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -