Sunday, May 19, 2024
- Advertisement -

వాట్సాప్ ఎందుకు బంద్ అయిపోయింది

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ సేవలు నిన్న కొంచెం సేపు నిలిచిపోవడంతో యూజర్లు తెగ కంగారు పడిపోయారు. ప్రపంచ ప్రళయమేదో వచ్చేస్తుందని తెగ ఫీలయ్యారు. ఇందుకు వాట్సాప్ కూడా క్షమాపణ చెప్పేసింది. ఇంకో వైపు అఫ్ఘనిస్తాన్‌లో సైతం వాట్సాప్‌కు చిక్కులు వచ్చి పడ్డాయి. ఆ దేశంలో వాట్సాప్ మెసెంజర్ యాప్ పై తాత్కాలింగా నిషేధం విధిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ఒక్కసారిగా ప్రకటించడం సంస్థకు నష్టాన్ని తెచ్చేదిగా మారిపోయింది. ఈ నిషేదం టెలిగ్రామ్‌ అనే మరో మెసేజింగ్‌యాప్‌ను వెంటాడింది.

తాలిబన్లు, మిగతా తీవ్రవాద గ్రూపులు వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేసుకుంటున్న కారణంగా ఈ డెసిషన్ తీసుకున్నామని తెలిపింది. కీలకమైన ప్రభుత్వ సమాచారం కూడా వాట్సాప్ నుంచి మిలిటెంట్ గ్రూప్స్ కు…. చేరుతోందని నిఘా వర్గాల హెచ్చరించాయి. దీంతో ఈ నవంబర్ మాసం మొత్తం ఈ మెసెంజర్ యాప్ అక్కడ పని చేయదు. దాని ఎఫెక్టే..ఏసియాలోని కొన్ని దేశాల్లో కూడా పనచేసింది.అందుకే మనకు కూడా వాట్సాప్ నిన్న కొంచెం సేపు మొరాయించింది. ఫస్ట్ టైమ్ ఈ సమస్యను చూసే సరికి చాలామందికి వాట్సాప్ క్వాలిటీ విషయంలో పెదవి విరిచారు. ఒకవేళ భవిష్యత్ లో మనకు కూడా తీవ్రవాదుల నుంచి అలాంటి థ్రెట్ ఉంటే గనుక సమీప భవిష్యత్ లో వాట్సాప్ మనకు కూడా పనిచేయదు. సో ఇప్పటినుంచో వాట్సాప్ ,ఎఫ్ బి మెసెంజర్ యాప్ ల విషయంలో మరీ ఎక్కువ ఎఫెక్షన్ తో ఉండకండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -