Friday, May 10, 2024
- Advertisement -

జ‌గ‌న్ పాద‌యాత్ర‌కోసం గిద్దలూరు ఇన్చార్జి ఐవి రెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు..

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాద‌యాత్ర‌కు ఉన్న అడ్డంకుల‌న్నీ తొల‌గిపోయాయి. ప్ర‌భుత్వంనుంచి పాద‌యాత్ర‌కు అనుమ‌తి కూడా ల‌భించింది. ఇప్ప‌టికె అన్ని జిల్లాల్లో పాద‌యాత్ర‌కు సంబంధించి అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. పాద‌యాత్ర విజ‌య‌వంతం అవ్వాల‌ని అన్ని ప్రాంతాల్లో నాయ‌కులు పూజ‌లు చేస్తున్నారు.

మొన్న రోజా కూడా జ‌గ‌న్ పాద‌యాత్ర విజ‌య‌వంతం కావాల‌ని దేవునికి 1001 కొబ్బరి కాయలు కొట్టి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఇప్పుడు తాజాగా గిద్ద‌లూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ ఐవి.రెడ్డికూడా పాద‌యాత్ర విజ‌య‌వంతం అవ్వాల‌ని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారికి 1001 కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.

గిద్దలూరు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రేస్ పార్టీ ఇన్చార్జి ఐవి రెడ్డి యువసేన సబ్యులు స్వామివారికి తలనీలాలు సమర్పించిన అనంతరం స్వాములవారికి 1001కొబ్బరి కాయలు కొట్టి శ్రీ నెమలిగుండ్ల రంగ నాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన గిద్దలూరు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రేస్ పార్టీ ఇన్చార్జి ఐవి రెడ్డి గారు మరియు నాయకులు.

రాష్ట్ర మహిళా కార్యదర్శి చెన్నువిజయ బేస్తవారిపేట మండల అద్యక్షులు బొల్లా బాల్ రెడ్డి చెక్కర బాలనాగి రెడ్డి (గిద్దలూరు మండల వై సి పి అద్యక్షులు) కొమరోలు పట్టణ అద్యక్షులు మనుకొండు గురుప్రసాద్ శీలం బాల అంకి రెడ్డి (మాజీ సర్పంచి)జిల్లా ఐ.టి ప్రధాన కార్యదర్శి చల్లా అశోక్ రెడ్డి, కంభం మండల కన్వీనర్ రామిరెడ్డి శ్రీనివాస రెడ్డి అర్దవిడు మండల కన్వీనర్ బత్తిని సర్వేశ్వరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

వీరితో పాటు కమలపాటి వెంకటేశ్వర్లు(జిల్లా బిసి సెల్ ప్రదాన కార్యదర్శి) సొసైటీ చైర్మన్ ఇండేల నాగిరెడ్డి, వాటర్ షెడ్ చైర్మన్ బిక్కా నరసింహ రెడ్డి, మాజీ యమ్.పి.పి వెంకట్ రాజు, పి.వి పురం సర్పంచ్ రమణా రెడ్డి, యమ్.వి సుబ్బా రెడ్డి, కోటయ్య, బి.సి సేన నాయకులు భీమయ్య, యస్.సి సెల్ నాయకులు సామేలు, వాణిజ్య విభాగం నాయకులు కొండా రెడ్డి, బి.పేట టౌన్ అద్యక్షులు కొండా రఘునాథ్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -