Sunday, May 12, 2024
- Advertisement -

ఆ టీవీ ఛానల్ శివాజీ కోసం చాలా కష్టపడుతోందోచ్..!

- Advertisement -

నటుడు శివాజీ సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు కానీ.. అతడిని పొలిటికల్ గా హీరోను చేసేంత వరకూ ఒక మీడియా సంస్థ నిద్రపోయేలా లేదు!  

ఆ న్యూస్ ఛానల్ అధిపతి హీరో శివాజీకి చాలా దగ్గరవాడు అనేది ఇది వరకటి నుంచి చర్చలో ఉన్న అంశమే. ఆ అనుబంధంతోనే ఆ మీడియాధిపతి ఈ హీరోకి చాలా ప్రయారిటీ ఇస్తూ వచ్చాడు.

ఇక ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ నటుడు చేస్తున్న దీక్ష గురించి కూడా ఆ మీడియాధిపతికి చెందిన న్యూస్ చానల్ లో తెగ కవరేజీ ఇస్తున్నారు. ఊరికే కవరేజ్ చేయడమే కాదు.. శివాజీ స్ఫూర్తితో ఏపీలో ప్రత్యేక హోదా డిమాండ్ కు ఒక ఊపు వస్తోందని.. శివాజీ స్ఫూర్తితో అనేక మంది దీక్షలు చేస్తున్నారని.. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ గురించి శివాజీ ప్రజల్లో అవగాహన పెంచేస్తున్నాడని.. శివాజీ వల్లనే ఈ డిమాండ్ కు అనుగుణంగా వాయిస్ వినిపిస్తోందని… ఆ న్యూస్ చానల్ విశ్లేషిస్తోంది!

ఓవరాల్ గా ఈ ప్రత్యేక హోదా పోరాటం క్రెడిట్ అంత శివాజీకే దక్కేలా చేయాలనేది ఈ చానల్ ప్రయత్నంగా కనిపిస్తోంది. మరి దీక్ష చేపట్టిన శివాజీ ని అభినందింవచ్చు కానీ.. ఈ చానల్ చేస్తున్న అతి ప్రచారం మాత్రం..  ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతోందేమో అనే అనుమానాలను కలిగిస్తోంది!  

దీంతో ఆ చానల్ ప్రచారం అంతిమంగా శివాజీకి మేలు చేస్తుందో… చెడ్డపేరును తీసుకు వస్తుందో అనే సందేహాలు కూడా జనిస్తున్నాయి. మొత్తంగా ఈ వ్యవహారం ఇంకా ఎంత వరకూ వెళుతుందో చూడాలి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -