- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి అదే మిస్టరీని కొనసాగిస్తున్నాడు..!

- Advertisement -

అభిమానులను ఒక అభిప్రాయానికి రానివ్వడం లేదు మెగాస్టార్. వారి ఆశలను నిజం చేస్తాడా.. లేక ఇంతటితోనే శుభం కార్డు వేస్తాడా? అనే అంశం గురించి ప్రతిష్టంభనను కొనసాగిస్తాడు.

ఓవరాల్ గా ఆయన మిస్టరీని కొనసాగింపజేస్తున్నాడు. రెండు రోజుల క్రితం చిరంజీవి సినిమా “ఆటోజానీ” గురించి వార్తలు వచ్చాయి. అప్పుడెప్పుడో పూరీ ప్రతిపాదించిన సినిమా తెరకెక్కనుందన్నదనేది ఈ వార్తల సారాంశం.

మరి అది తెరకెక్కుతుందా.. అని అభిమానులు ఆలోచిస్తుంటే.. ఇంతలోనే మెగాస్టార్ పొలిటికల్ ప్రోగ్రామ్ లో దర్శనం ఇచ్చాడు.  కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలో పాలు పంచుకొన్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో జరిగిన కార్యక్రమంలో ఆయన కనిపించాడు. తద్వారా ఆయన తను పాలిటిక్స్ తో టచ్ లోనే ఉన్నాను అని చిరంజీవి చెప్పుకొన్నట్టైంది.

మరి ఇప్పుడు చిరంజీవి సినిమాల వైపు దృష్టి సారిస్తారా? లేదా? అనేది క్లారిటీ లేని అంశమే అవుతోంది. చిరంజీవి 150 సినిమాలో నటిస్తే బావుంటుందని ఎదురుచూస్తున్న అభిమానులు మాత్రం ఆ విషయంపై తమ అభిమాన హీరో క్లారిటీ ఇవ్వకపోవడంతో ఒకింత నిరాశ పరుస్తున్నారు. చిరంజీవి తిరిగి సినిమాల వైపు రావాలని అనుకొంటున్న వారి ఆశలను చిరంజీవి నెరవేరుస్తాడో లేదో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -