టాలీవుడ్ డ్రగ్స్ కేసు హైదరాబాదులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో విచారణకు హాజరైన ప్రతి ఒక్కరినీ మరోసారి విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందూలను విచారించిన ఈడీ అధికారులు నేడు తరుణ్‌ను ప్రశ్నించనున్నారు.
ఈ కేసులో నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటికే అధికారులు టాలీవుడ్ ప్రముఖులను విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నోటీసులు అందుకున్న నేపథ్యంలో తరుణ్ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారుల ముందు విచారణకు హాజరయ్యాడు.
ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాదారులతో ఆయనకు ఉన్న సంబంధాలపై విచారిస్తున్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిగాయన్న విషయంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read
సీనియర్ నటి లక్ష్మీ 3 పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం ఇదే..!
సాయి పల్లవి గురించి మీకు తెలియని నిజాలు !