ట్రోలింగ్ వ్యవహారంపై స్పందించిన నాగబాబు

డ్రగ్స్ వ్యవహారంలో మెగా డాటర్ నిహారక పేరు బయటకు రావడంతో టాలీవుడ్ పరిశ్రమ షేక్ అయ్యింది. ఆమె ఎలాంటి తప్పు చేయలేదంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నా… సోషల్ మీడియాలో మాత్రం ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. నెటిజన్లు మెగా డాటర్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ట్రోలింగ్ వ్యవహారంపై తాజాగా నాగబాబు స్పందించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ వ్యవహారంలో నిహారిక పేరు బయట వచ్చిన వెంటనే నాగబాబు స్పందించారు.

తన కుమార్తెకు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం లేదని తేల్చిచెప్పారు. వాస్తవం ఏంటన్నది విచారణలో తేలుతుందన్నారు. అయితే పబ్బులో దొరికిన వారందరినీ పోలీసులు .. స్టేషన్‌కి తరలించి నోటీసులు ఇచ్చి పంపించారు. నలుగుర్ని మాత్రం అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అలా పోలీసులు నోటీసులు ఇచ్చిన వారిలో నిహారిక కూడా ఉంది. డ్రగ్స్ వ్యవహారంపై నిహారిక ఉన్నట్లు వార్తలు గుప్పుమనడంతో ట్రోలర్స్ ఆమెను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.

డ్రగ్స్ క్వీన్‌ నిహారిక అనే హ్యాష్‌ ట్యాగ్‌తో సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారు. తన కూతురి తప్పు లేదంటూ నాగబాబు విడుదల చేసిన వీడియోపైన కూడా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా చానల్స్ సైతం మెగా ఫ్యామిలీని ఇరకాటంలో పెడుతూ వార్తలు ప్రసారం చేశాయి.

అర్ధరాత్రి 2 గంటల దాకా భర్తను వదిలేసి కూతురు పబ్‌లలో చిందులు వేయడం తప్పు కాదా అని నాగబాబును పప్రశ్నిస్తూ కొందరు ట్రోల్ చేశారు. నిహారికను చూస్తే గర్వంగా ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. నెటిజన్లు చేస్తున్న కామెంట్స్‌పై నాగబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

తమ కుటుంబాన్ని అపత్రిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని వదలబోనంటూ ఆయన హెచ్చరించినట్లు సమాచారం. తమను కించపరుస్తూ కామెంట్స్ పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలకు నాగబాబు సిద్ధమవుతున్నారట. మరి ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి మరి.

మళ్లీ తెరపై చిరు విశ్వరూపం

రాశీఖన్నా షాకింగ్ కామెంట్స్… వారి మెప్పుకోసమేనా ?

సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సోనాలి

Related Articles

Most Populer

Recent Posts