Wednesday, April 24, 2024
- Advertisement -

రాడిసన్ పబ్‌, లిక్కర్ లైసెన్స్ రద్దు

- Advertisement -

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వ్యవహారంతో సంచలనంగా మారిన రాడిసన్ హోటల్‌పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాడిసన్ హోటల్ లైసెన్స్‌ను ఎక్సైజ్‌ శాఖ రద్దు చేసింది. పబ్‌, లిక్కర్‌ లైసెన్సులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 24 గంటలపాటు మద్యం సరఫరాకు రాడిసన్‌ హోటల్‌ అనుమతి తీసుకుంది.

ఈ మేరకు జనవరి 21న రాడిసన్ హోటల్‌కు అనుమతి లభించింది. రూ.56 లక్షలు బార్‌ టాక్స్‌ చెల్లించి లిక్కర్ సప్లైకి నిర్వాహకులు అనుమతిని తీసుకున్నారు. 2B బార్‌ అండ్ రెస్టారెంట్‌ పేరుతో అనుమతులు పొందినట్లు తెలుస్తోంది. అయితే పబ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం బయటపడటంతో ఎక్సైజ్‌ శాఖ చర్యలు చేపట్టింది.

పోలీసుల తనిఖీల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుపడటంతో కలకలం రేగింది. దాదాపు 150 మంది అర్థరాత్రి రేవ్ పార్టీ చేసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యవహారంలో మెగా డాటర్ నిహారిక, బిగ్‌ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌ పేర్లు సైతం బయటకు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ హాట్‌టాపిక్‌గా మారింది.

మహేశ్‌తో రాజమౌళి సినిమాపై అప్‌డేట్

ఆ సినిమాకు ఓకే చెప్పిన కీర్తి సురేష్

కేజీఎప్‌-2తో ఢీకొట్టబోతున్న విజయ్‌ మూవీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -