భారతదేశంలో ఎన్నో వాటికి కొరత ఉంటుంది.. అయితే ఇప్పుడు ఏకంగా కండోమ్ ల కే కొరత వచ్చింది. దీంతో ఎయిడ్స్ వ్యాప్తి పెరుగుతోందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ అథారిటీ వారు కూడా ఈ విషయాన్ని ఒప్పుకొంటున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే… ఎయిడ్స్ నియంత్రణ కోసం అని దేశంలో చాలా సంవత్సరాలుగా ఫ్రీ కండోమ్స్ పథకం ఒకటి అమల్లో ఉంది. అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఈ పథకం నడుస్తోంది. ఈ పథకం కింద వేశ్య వృత్తిలో ఉన్న మహిళలకు ఉచితంగా కండోమ్స్ పంపిణీ జరుగుతోంది.
తమ దగ్గరకు వచ్చే క్లయింట్స్ కండోమ్స్ తెచ్చుకోకపోయినా.. ఆ మహిళలు తమ దగ్గర ఉన్న కండోమ్స్ ను వారికి ఇచ్చి ఎయిడ్స్ నుంచి కాపాడుకోవడానికి.. ఎయిడ్స్ నియంత్రణను అరికట్టడానికి ఈ ఉచిత కండోమ్స్ పథకాన్ని ప్రవేశపెట్టారు. రెడ్ లైట్ ఏరియాల్లోని మహిళలకు ఇలా కండోమ్స్ ను ఇవ్వడం జరుగుతోంది. అయితే గత కొంతకాలంగా ఈ పథకానికి బ్రేకులుపడ్డాయి. ఉచితంగా పంచే కండోమ్స్ స్టాక్ నిండుకుంది. దీంతో వేశ్యలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.
కండోమ్స్ అందుబాటులో లేకపోయినా.. వారి దగ్గరకు కస్టమర్స్ వస్తుంటారు. కస్టమర్స్ కండోమ్ తో రారు.. ఈ వృత్తిలో ఉన్న మహిళలకు సొంతంగా కండోమ్స్ కొనుక్కొనే శక్తి లేదు. దీంతో ఇప్పుడు ఎయిడ్స్ భయం పెరిగింది. ఢిల్లీ, ముంబై, కోల్ కతా.. ఇలా ప్రధాన నగరాల్లోని అన్ని వేశ్యవాటికల్లోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొందని సామాజిక కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీలైనంత త్వరలో పరిస్థితిని సరిదిద్దుతామని.. కండోమ్ ల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తామని నాకో చెబుతోంది. మరి అంత వరకూ ఎయిడ్స్ ప్రబలాల్సిందేనేమో!