Sunday, May 19, 2024
- Advertisement -

గర్భిణీ మహిళకి హెచ్ఐవి బ్ల‌డ్ ఎక్కించిన ఆసుప‌త్రి సిబ్బంది…

- Advertisement -

ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన గ‌ర్భినికి ల్యాబ్‌ టెక్నీషియన్ల నిర్లక్ష్యం కారణంగా వైద్యులు హెచ్‌ఐవీ బ్లడ్‌ ఎక్కించారు. దీంతో కుటుంబ స‌భ్యులు ఆందోళనకు దిగింది. ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లాలో ఈనెల 6న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విరుదునగర్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గర్భిణి చికిత్స కోసం ఈనెల 6న చేరింది. అయితే ఆమెకు రక్తం అవసరం కావడంతో ఆసుపత్రి సిబ్బంది బ్లడ్ బ్యాంకు నుంచి తెచ్చిన రక్తాన్ని ఎక్కించారు. సందర్భంగా దాత నుంచి సేకరించిన రక్తాన్ని ల్యాబ్ సిబ్బంది పరీక్షించలేదు. దీంతో హెచ్ఐవీ సోకిన రక్తాన్ని ఆసుపత్రి సిబ్బంది సదరు మహిళకు ఎక్కించేశారు. ఆ తర్వాత పరీక్షలు చేయగా.. ఆమెకు హెచ్ఐవీ సోకినట్లు తేలింది .

అయితే రక్తం దానం చేసిన వ్యక్తి విదేశాలకు వెళ్లే క్రమంలో రక్త పరీక్ష చేయించుకున్నాడు. దాంట్లో హెచ్ఐవీ, హెపటైటిస్-బి ఉన్నట్లు తేలింది. వెంటనే అతను బ్లడ్‌ బ్యాంకు వారికి సమాచారం ఇచ్చాడు. కానీ అప్పటికే ఆ రక్తాన్ని గర్భిణీకి ఎక్కించడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఈ విషయం మీడియాలో రావడంతో తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లను విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే బాధితురాలు లేదా ఆమె భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -