Sunday, May 12, 2024
- Advertisement -

భ‌ర్త‌కు ఎయిడ్స్ సోకింద‌ని భార్య ఏం చేసిందంటే..?

- Advertisement -

అక్ర‌మ సంబంధాలు ఆ కుటుంబాల‌ను చిన్నా భిన్నం చేస్తున్నాయి. త‌మ అక్ర‌మ సంబంధాల‌కు అడ్డు వ‌స్తున్నార‌ని భార్య‌ల చేతిలో భ‌ర్త‌లు హ‌త‌మ‌వుతున్న సంఘ‌ట‌న‌లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా అలాంటి సంఘ‌ట‌నే రాజ‌మండ్రి స‌మీపంలో చోటు చేసుకుంది. త‌మ అక్ర‌మ సంబంధానికి అడ్డు వస్తున్నాడ‌ని హ‌త్య చేసింది భార్య‌.

రాజమండ్రి సమీపంలోని మల్లేపల్లి గ్రామానికి చెందిన తోట దుర్గారావు డ్రైవర్. భార్యా పిల్లలు ఉన్నప్పటికీ 2013లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన లావణ్యను రెండో పెళ్లి చేసుకున్నాడు.. వీరిద్దరు పిల్లలు.అయితే దుర‌ల‌వాట్ల కార‌నంగా ఎయిడ్స్‌, టీబీ వ్యాధులు సోకాయి. ఈ క్రమంలో దుర్గారావు తన కాపురాన్ని కాకినాడ సమీపంలోని కరప గ్రామానికి మార్చాడు. భర్త హెచ్ఐవీ రోగి అని తెలుసుకున్న లావణ్య అతనిని దూరం పెట్టి…సమీప బంధువైన వాసంశెట్టి వీర రామకృష్ణకు దగ్గరైంది.

2015లో రామకృష్ణ హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌కు కుటుంబంతో సహా వచ్చి.. ఓ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.. 2018 సెప్టెంబర్‌లో దుర్గారావు, లావణ్య కూడా నగరానికి రావడంతో.. రామకృష్ణ వారికి అద్దె ఇల్లు ఇప్పించాడు. అప్పటికే వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉండటంతో.. దుర్గారావు లేని సమయంలో రామకృష్ణ.. లావణ్యతో గడిపేవాడు.

గత నెల 31వ తేదీన రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన దుర్గారావు తన భార్య లావణ్య, రామకృష్ణ ఒకే గదిలో అభ్యంతరకర రీతిలో ఉండటాన్ని చూసి కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలో ముగ్గురికి గొడవ జరగడంతో లావణ్య తన చేతికి అందిన ఇనుప ట్యాప్ వాటర్‌పైప్‌ను భర్త తలపై కొట్టింది.

వెంటనే ప్రియుడితో కలిసి చున్నీతో దుర్గారావు మెడకు ఉరివేసి హతమార్చింది.. తరువాతి రోజు ఉదయం రామకృష్ణ తాను పనిచేస్తున్న సంస్థ నుంచి ఓ వ్యాన్ తీసుకొచ్చి.. అందులో దుర్గారావు శవాన్ని తీసుకుని కీసర హైవేలోని పొదల్లో పడేశాడు. లావణ్య పిల్లలను తీసుకుని కాకినాడకు వెళ్లిపోయింది..

ఈ నెల 2 గుర్తు తెలియని మృతదేహం ముళ్లపొదల్లో ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు శవాన్ని పరిశీలించి హత్యగా కేసు నమోదు చేసుకున్నారు. ద‌ర్యాప్తులో హైవేపై ఉన్న సీసీ కెమెరాల పుటేజీని ప‌రిశీలించ‌డంతో అనుమానాస్ప‌దంగా వ్యాన్‌ను గుర్తించారు.దాని నెంబర్ ఆధారంగా అదే ఏ కంపెనీదో గుర్తించి యజమాని వద్ద పనిచేసే నలుగురు డ్రైవర్లను గుర్తించి ఆరా తీయగా.. చివరికి రామకృష్ణ హత్య జరిగిన రోజు అటుగా సంచరించడాన్ని గమనించారు. అత‌న్ని విచారింగానేరాన్ని అంగీక‌రించాడు. దీంతో లావ‌ణ్య‌, రామ‌కృష్ణ‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -