Saturday, May 4, 2024
- Advertisement -

భర్త గే అని వైద్యురాలి ఆత్మహత్య!

- Advertisement -

దేశ రాజధాని లోని ఎయిమ్స్ లో పనిచేసే వైద్యురాలు ప్రియావేది ఆత్మహత్య గురించి పరిశోధిస్తున్న పోలీసులకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి.

మణికట్టు కోసుకొని మరణించిన స్థితిలో ఉన్న ఆమెది ఆత్మహత్యనా, హత్యనా.. అనే విషయం గురించి శోధిస్తున్న పోలీసులకు ఆమె ఫేస్ బుక్ పోస్టులు విచారణలో ఉపయోగపడ్డాయి. వాటి ప్రకారం చూస్తే.. ప్రియావేదిది ఆత్మహత్యనే అని పోలీసులు నిర్దారించారు.

ఆమె ఆత్మహత్యకు గల కారణాల గురించి కూడా బహిర్గతమైంది. ఆమె భర్త అయిన కమల్ వేది గే కావడం, అతడు కట్నం గురించి ఆమెను వేధిస్తుండటంతో ప్రియ ఆత్మహత్య చేసుకొందని పోలీసులు ధ్రువీకరించారు. ఈ విషయం ఆమె ఫేస్ బుక్ పోస్టులను బట్టి తేలింది. కమల్ వేది కూడా ఎయిమ్స్ లోనే డాక్టర్ గా పనిచేస్తున్నాడు.

తన భర్తకు వేరే మగాళ్లతో సంబంధాలున్నాయని.. ఐదు సంవత్సరాలుగా తను పేరుకు మాత్రమే భార్యగా జీవిస్తున్నానని… ప్రియావేది ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ఇంత వరకూ తమ మధ్య శారీరక సంబంధం కూడా లేదని.. తన భర్త కు ఒక జీమెయిల్ అకౌంట్ ఉందని.. దాంతో అతడు గే ఫ్రెండ్స్ తో చాట్ చేస్తుంటాడని.. గే పోర్న్ సినిమాలు కూడా చూస్తుంటాడని ఆమె పేర్కొంది. ఈ ఐదేళ్లూ తనను అతడు శారీరకంగా, మానసికంగా వేధించాడని ప్రియ పేర్కొంది.

మరి భర్త గే కావడం ఒక భార్య ఆత్మహత్య చేసుకోవడం అంటే.. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పవచ్చు. విడాకులు వంటి అవకాశం ఉన్నా.. ఆమె ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొందో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -