Tuesday, May 14, 2024
- Advertisement -

రేవంత్ రెడ్డి లక్ష్యం రామోజీరావేనా?!

- Advertisement -

తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి లక్ష్యం ఎవరు? ఎవరిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఒకింత సంచలమైన ఆరోపణ చేశాడు?

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడటం అలవాటుగా కలిగిన రేవంత్ రెడ్డి తరచూ తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఉంటాడు. తెలంగాన రాష్ట్ర సమితిది కేసీఆర్ కుటుంబ పాలన అని.. కేసీఆర్ సంతానం, మేనల్లుడు హరీస్ రావులు దోచుకొంటున్నారని రేవంత్ అంటుంటాడు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచినే కేసీఆర్ ఫ్యామిలీపై ఇలాంటి విమర్శలను చేసే అలవాటు ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాకా ఆ ఆరోపణలను మరింత తీవ్రతరం చేశాడు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకోవడం.. తెలుగుదేశం నుంచి అనేక మంది నేతలను టీఆర్ఎస్ వైపు మమళ్లించుకోవడంతో తెలుగుదేశం పార్టీకి బద్దుడు అయిన రేవంత్ కు కేసీఆర్ పై మరింత కసి పెరిగింది.

ఈ నేపథ్యంలో రేవంత్ అనునిత్యం కేసీఆర్ పై ఏదో ఒక అస్త్రాన్ని సందర్శిస్తూ ఉంటాడు. ఇలాంటి నేపథ్యంలో ఆయన తాజాగా కేసీఆర్ పై విరుచుకుపడ్డాడు. అది రొటీనే అనుకొంటే.. కేసీఆర్ ఆంధ్రా వ్యాపారుల కమిషన్లకు అలవాటు పడ్డాడని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా ఉంది. ఈ మధ్యకాలంలో కేసీఆర్ తీరును గమనిస్తే.. ఆయన తరచూ ఈనాడు పత్రిక అధినేత రామోజీని  పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీని, రామోజీ ప్రతిపాదిస్తున్న ఓం సిటీని  కేసీఆర్ ప్రశంస్తున్నాడు. ఒకప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానని ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు ఇలా మాట్లాడుతుండటం అనేక మంది తెలంగాణ వాదులను ఆశ్చర్యపరుస్తోంది!

ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పై విమర్శలు చేయడం.. ఆంధ్రోళ్ల కమిషన్లకు అలవాటు పడ్డాడని వ్యాఖ్యానించడంతో.. ఈయన ఏమైనా పరోక్షంగా ఈనాడు అధినేత గురించి ప్రస్తావించాడా?! అనే సందేహాలు కలుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -