Saturday, May 18, 2024
- Advertisement -

కండోమ్ ల కొనుగోలులో ఆడవాళ్లదే చొరవ..!

- Advertisement -

దేశ రాజధానిలోని సంసార వ్యవహారాల గురించి ఒక సర్వే ఆసక్తికరమైన విషయాలను చెబుతోంది.

శారీరక సంబంధాల గురించి.. ఫ్యామిలీ ప్లానింగుల గురించి.. ఆడవాళ్లు, మగవాళ్లు స్పందించే తీరు గురించి సాగిన అధ్యయనం ఒకింత ఆసక్తికరమైన విషయాలను  వెల్లడించింది. 

ఈ సర్వే ప్రకారం… శారీరక సంపర్కంలో మగవాళ్లు వాడే కండోమ్ ల కొనుగులు గురించి ఆడవాళ్లే చొరవ చూపుతున్నారు. వాటిని కొనుగోలు చేయడంలో వారే ముందుంటున్నారు. షాపింగ్ లోనైనా.. వాటి కోసమే షాపుల వరకూ వెళ్లినా.. కండోమ్ ల కొనుగోలులో మహిళామణులదే చొరవ అని ఆ మెట్రో మహా నగర పరిధిలో జరిగిన ఈ సర్వే చెబుతోంది.

మగావాళ్లకు మొహమాటం!: 

కండోమ్ అవసరమైన సందర్భాల్లో వాటిని కొనడానికి ఆ మహానగరంలోని మగవాళ్లు సంకోచంలో పడుతున్నారట. ఎవరైనా ఏమైనా అనుకొంటారేమో.. అడగడం ఎలా.. అనే సంకోచాలతో వారు సేఫ్టీల కొనుగులు పట్ల చొరవ చూపడటం లేదు. దీంతో ఈ బాధ్యతను ఆడవాళ్లే తీసుకొంటున్నారు. వివాహం అయినప్పటికీ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ లో భాగంగా కండోమ్ ల వినియోగం తప్పనిసరి అవుతోంది. గర్భ నోరోధానికి ఇతర పద్ధతులు అందుబాటులో ఉన్నా..అవి తమ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతయేమోనన్న భయంతో ఆడవాళ్లు కండోమ్ వైపే చూస్తున్నారు. మగాడికి చొరవలేకపోతే.. తమే స్వయంగా ముందుకెళ్లి తెచ్చుకొంటున్నారని ఈ అధ్యయనం తేల్చింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -