Thursday, May 16, 2024
- Advertisement -

ఎయిర్ పోర్ట్ లో అలా చేస్తున్నాడేంటి..

- Advertisement -

అతడో ఎయిర్ పోర్ట్ ఉద్యోగి.సో ఎంతో పద్దతిగా టైమ్ ప్లానింగ్ ను కరెక్ట్ గాఫాలో అవుతూ ఉండాలి. వన్స్ డ్యూటీలోకి వచ్చాక ఎక్స్ ట్రాలు ,బిల్డప్ లు కొట్టకూడదని ఎవరికి వారు టిప్ టాప్ గా తయారై… ఆర్డర్లను అలా ఫాలో అయిపోతూ ఉంటారు. అయితే అదేంటో అతగాడికి డ్యాన్సంటే ఎంతో ఇష్టమట. ఎక్కడా లేనట్టు ఈ మధ్య విమానాశ్రయ టర్మాక్ ( విమానాలు తిరిగే చోట) వద్దే డ్యాన్స్ చేస్తూ తన అభిరుచిని చాటుకున్నాడు.

కైరాన్ యాష్ ఫోర్డ్ అనే ఈ ఎయిర్ పోర్ట్ ఉద్యోగి.. న్యూయార్క్ లోని గ్రేటర్ రోచెస్టర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఆపరేటర్ ఏజంటుగా గత ఐదు సంవత్సరాలుగా విదులు నిర్వహిస్తున్నాడు. విమానమెక్కే ప్రయాణికులకు ఇతడు ఇచ్చే ఆదేశాలను ఓ పాటలా పాడడం, అప్పుడప్పుడు డ్యాన్సులు గట్రా చేసి వారిని ఆనంద పరచడం ఇతని హాబి.

అయితే ఈ సారి డిఫరెంట్ మోడ్ లో వెరైటీగా ఇలా టార్మాక్ మీద దర్శనమిచ్చాడు. నషవిల్లె లోని సింగర్ టెరిమెక్ బ్రైడ్ ఓ విమానమెక్క బోతూ ఎందుకో టర్మాక్ వైపు చూసేసరికి అక్కడ కైరాన్ చేతులూపుతూ, స్టెప్పులు వేస్తూ కనిపించాడు. అంతే… తన సెల్ లో ఆ దృశ్యాన్ని బంధించాడు. ఈ వీడియో గత వారం రోజుల్లోనే 7 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇది వైరల్ కాగానే.. తను సంతోషం పట్టలేకపోతున్నానని కైరాన్ చెబుతున్నాడు. టర్మాక్ డ్యాన్సర్ గా తను పాపులర్ అయ్యానని తెగ సంబరపడుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -