Monday, May 6, 2024
- Advertisement -

అకున్ సబర్వాల్ కు ఫోన్ లో బెదిరింపులు.. ఎందుకు..?

- Advertisement -

టాలీవుడ్ లో సెలబ్రీటిలను డ్రగ్స్ కేసులో విచారిస్తున్న అకున్ సబర్వాల్ కు అప్పుడే బెదిరింపులు స్టార్ట్ అయ్యాయి. తీగ లాగితే.. డింక కదిలినట్లు.. ఈ వ్యవహారంలో ఉన్న పెద్ద పెద్ద వారి గుండెల్లో భయం పట్టుకుంది. డ్రగ్స్ కేసు విచారణను సబర్వాల్ చాలా సీరియస్ గా తీసుకోవడంతో.. ఇక ఏం చేయాలో అర్ధం కాక వారి గుండెలు అదిరిపడుతున్నాయి. ఈ క్రమంలో అకున్ సబర్వాల్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్లు సమాచారం.

10రోజుల క్రితమే సబర్వాల్ కి ఆఫ్రికన్ యాసలో ఆయన్ను బెదిరించారట. విచారణ వెంతనే ఆపివేయాలని.. లేకుంటే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తమకు తెలుసు.. ఆ విషయం గుర్తుంచుకో అంటూ సదరు వ్యక్తి సబర్వాల్ ను బెదిరించినట్లు తెలుస్తోంది. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దాంతో ఈ డ్రగ్స్ దందాలో అంతర్జాతీయ ముఠాల హస్తం ఉందనే అనుమానం స్పష్టం అయింది. ఇది కేవలం హైదరబాద్ కే పరిమితమైన వ్యవహారం కాదని.. ఈ డ్రగ్స్ విషయంలో అంతర్జాతీయ స్థాయి నెట్ వర్క్ ఉందని ఈ పరిణామాలు వెల్లడిస్తున్నాయి.

ఈ అంతర్జాతీయ ముఠాలు కెల్విన్ ద్వారా డ్రగ్స్ దందాను హైదరబాద్ లో విస్తరించినట్లు తెలుస్తోంది. ఇక ఫోన్ కాల్స్ చేసిన వ్యక్తి ఎవరు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా డ్రగ్స్ కేసును సీరియస్ గా తీసుకున్న సబర్వాల్..ను ఎలా పక్కకు తప్పించాలన్న ఆలోచనతో ఇలా బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా విషయాలను సబర్వాల్ సీక్రెట్ గా బయటకు లాగుతున్నారు. ఇంకా విచారించాల్సిన వారు ఉన్నారు కాబట్టి మరెన్ని విషయాలు బయటపడుతాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -