చైనా ఈకామర్స్ దిగ్గజం అలీబాబా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.అది కూడా ‘సింగిల్స్ డే’ రికార్డు. కేవలం ఒకే ఒక్క రోజులో 91 వేల కోట్లు అమ్మకాలు సాగించి చరిత్ర సృష్టించింది.గత ఏడాది ఇదే రోజున 9.3 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపి రికార్డు సృష్టించగా….
ఈ ఏడాది ఆ రికార్డును అధిగమించి 13.8 బిలియన్ డాలర్లు అనగా మన కరెన్సీలో రూ.91 వేల కోట్ల అమ్మకాలు జరిపి వండర్ సృష్టించింది. అంతేకాదు ఈ ఏడాది ఒకే రోజు రికార్డు శాతంలో అమ్మకాలు జరిపి దాదాపు 56శాతం అధిక ఆదాయాన్ని ఆలీబాబా ఆర్జించింది.
