Monday, May 20, 2024
- Advertisement -

డేరా బాబా వెరీ రిచ్‌…

- Advertisement -

డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ ఆగడాలు ఒక్కటొక్కటే వెలుగు చూస్తున్నాయి. తన ప్రత్యేక మందిరంలో అతను అత్యాచారాలకు పాల్పడేవారని చెప్పారు.2002లో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు తాజాగా డేరా బాబా గురించి ఎవ‌రికీ తెలియ‌ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. రా బాబా భక్తులు చేస్తున్న దాడిలో ధ్వంసమవుతున్న ఆస్తులకు… ఆయన ఆస్తులను అమ్మి పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఆయ‌న‌కున్న ఆస్తుల గురించి తెలిస్తే క‌ళ్లు బైర్లు క‌మ్మాల్సిందే. ఇప్పుడు ఆయ‌న ఆస్తుల‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది.

ఆయన ఆశ్రమానికి వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. డేరా నూతన భవనం, పురాతన భవనం, అంతరాలయం, ఫైవ్ స్టార్ హోటల్, బిజినెస్ స్కూల్, కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూల్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వివిధ ఫ్యాక్టరీలు, ఎస్ఎంజీ ప్రాడక్ట్స్, ఫిల్మ్ సిటీ సెంటర్, మాహీ సినిమా, పంట పొలాలు, రెస్టారెంట్ ఇలా ఎన్నో డేరా బాబాకు ఉన్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రి ద‌గ్గ‌రా లేని అత్యంత విలాసవంతమైన 100 వరకు కార్లు ఆయన వద్ద ఉన్నాయి. ఈ కార్లలో ఆయన స్వయంగా పలు కార్లను డిజైన్ చేయించుకున్నారు. ఈ కార్లలోనే ఆయన భక్తుల మధ్య తిరుగుతుంటారు. అంతేకాదు ఆయన యాక్టర్, సింగర్, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ కూడా. ఈయ‌న‌కు సంబంధించిన ఆస్తుల ఒక్కొక్క‌టి బ‌య‌ట‌కు వ‌స్తుండంతో దేశ వ్యాప్తంగా అస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -