కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయో అందరికి తెలిసందే. టీడీపీ అధికారాన్ని అడ్డంపెట్టుకొని యధేచ్చగా అక్రమాలు, దౌర్జన్యాలు, ప్రలోభాలకు పాల్పడిందనేది బహిరంగ రహష్యమే. అయితే ఇప్పుడు ఆపార్టీకి మరోసారి షాక్ తగిలేలా ఉంది. నిబంధనలను తుంగలోకి తొక్కి టీడీపీ చేసిన చిన్న తప్పే ఆ పార్టీ పాలిట శాపంగా మారబోతోంది.
టీడీపీ తరుపున మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, చంద్రబాబునాయుడుతో సహా పలువురు స్టార్‌లు క్యాంపెన్ నిర్వహించారు. అయితే ఇప్పుడ ఎన్నికల ఖర్చుమీద ఈసీ దృష్టి సారించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తున్న అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి గరిష్టంగా రూ.28 లక్షలు ఖర్చు చేయొచ్చు. అభ్యర్థి తరఫు ప్రచారం నిర్వహించే వారికి అయ్యే ఖర్చుకు, అభ్యర్థి తన ప్రచారానికి చేసే ఖర్చుకు ఎలాంటి సంబంధం ఉండదు.
నిబంధనల ప్రకారం అభ్యర్థి తరఫు ఎవరెవరు ప్రచారం నిర్వహిస్తారో.. వారందరి పేర్లను ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన వారంలోగా ఎన్నికల కమిషన్‌కు అందించాల్సివుంటుంది. ఎవరెవరు ప్రచారం నిర్వహిస్తారన్న వివరాలను ఈసీకి అందించలేదు. నోటిఫికేషన్ వెలువడిన రెండు వారాల తర్వాత ప్రచారానికి వెళ్లే స్టార్ క్యాంపెయినర్ల వివరాలను టీడీపీ ఈసీకి పంపింది.
ఎన్నికలో ప్రచారం నిర్వహించిన స్టార్ క్యాంపెయినర్ల ఖర్చులను భూమా బ్రహ్మానంద రెడ్డి ఎన్నికల ఖర్చు కింద ఈసీ లెక్కేయనుంది. ఎన్నికల్లో చేసిన ఖర్చు రూ.28 లక్షలు దాటినట్లయితే.. ఒక వేళ నంద్యాలలో భూమా బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించినా దాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తమ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తరఫు నంద్యాలలో ప్రచారం నిర్వహించనున్న 40 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్ల జాబితాను ఆగస్ట్ 2వ తేదీనే ఎన్నికల కమిషన్‌కి పంపింది. ఈసీ చర్యలు తీసుకుంటె తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం లేకపోలేదు.
