Sunday, May 19, 2024
- Advertisement -

ప్ర‌పంచం కోటీశ్వ‌రుల్లో నెంబ‌ర్ వ‌న్ స్థానానికి స్తానం చ‌ల‌నం

- Advertisement -

ప్ర‌పంచంలో కోటీ శ్వ‌రుడు ఎవ‌రంటె ట‌క్కున గుర్తు కొచ్చేది మైక్రోసాఫ్ట్ అధినేత బిలిగేట్స్.ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌నె అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నారు.అయితే త్వ‌ర‌లోనె ఆయ‌న స్థానం మార‌నుంది.నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని మ‌రోక‌రు ఆక్ర‌మించ‌నున్నారు.

ప్రపంచంలోని కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బిల్‌గేట్స్‌ను అమేజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ వెనక్కి నెట్టనున్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్‌గేట్స్ గత నాలుగేళ్ల పాటు ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. బిల్ గేట్స్ ఆస్తుల విలువ 90.1 బిలియన్ డాలర్లు.

ఈ నేపథ్యంలో అమేజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్.. ఇంకా మూడే వారాల్లో బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి.. కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటారని ఫోర్బ్స్ అంచనా వేసింది.

ప్రస్తుతం జెఫ్ బెజోస్ ఆస్తుల విలువ 88.2 అమెరికన్ డాలర్లు. ఇంకా రెండు వారాల్లో బిలియన్ డాలర్లు అధికమైతే.. ఈయన ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -