Thursday, May 16, 2024
- Advertisement -

వైజాగ్ పార్ల‌మెంట్ స్థానంనుంచి పోటీ

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేడి రాకుమందే ఏపీలోమాత్రంరాజ‌కీయాలుమ‌రింతవేడుక్కుతున్నాయి.ఇప్ప‌టినుంచె వివిధ పార్టీల్లోని నేతలు తమకు అనువుగా ఉండే పార్టీల‌ల్లో త‌మ సీట్లు ఖ‌రారు చేసుకొనె ప‌నిలో ప‌డ్డారు.ఎన్నిక‌ల నాటికి ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయో ఊహించి త‌మ ఇల్ల చ‌క్క‌బెట్టుకుంటున్నారు.

ప్ర‌ధానంగా అన్ని పార్టీల‌ల్లో వ‌ల‌స‌లు ఊపందుకుంటున్నాయి.వైసీపీ నుండి చంద్రబాబునాయుడు ఇప్పటికే 21 మంది ఎంఎల్ఏలను లాక్కున్న విషయం తెలిసిందే. ఇంకా ఎవరైనా వస్తారా అని కాగడా పెట్టుకుని వెతుకుతున్నారు.ఇక వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరిగాయంటు వ‌స్తున్న వార్త‌లు వ‌స్తున్నా పెద్ద‌నాయ‌కులు ఎవ‌రు చేర‌లేదు.

ఇంతలో కాంగ్రెస్ కు చెందిన పలువురు సీనియర్ నేతలు వైసీపీలోకి చేరటానికి రంగం సిద్ధమవుతోంది. విజయవాడకు చెందిన మాజీ ఎంఎల్ఏ మల్లాదివిష్ణు వైసీపీలో చేరుతున్న సంగతి తెలిసిందేకదా? అదే దారిలో కేంద్రమాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి కూడా వైసీపీలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఎస్ఆర్ వైసీపీ త‌రుపున వైజాగ్ పార్ల‌మెంట్ స్థానంనుంచి పోటీ చేస్తార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.నిజానికి ఉత్ర‌రాంధ్రాలో పార్టీకి బ‌ల‌మైన నాయ‌కులులేరు.అందుకనే టిఎస్ఆర్ గనుక వైసీపీలోకి వస్తే పార్టీకి పెద్ద ఊపు వస్తుందని భావిస్తున్నారు.

టిఎస్సాఆర్ తో పాటు ఇంకా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు వైసీపీవైపు చూస్తున్నారని సమాచారం.
కాంగ్రెస్ లో నుండి వైసీపీకి వెళ్లాలనుకుంటున్న వారిలో సుమారు 15 మంది ప్రముఖులు ఇప్పటికే జగన్ తో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వారిలో ముగ్గురు పార్లమెంటుకు మిగిలిన వారు అసెంబ్లీకి పోటీ చేయటానికి మొగ్గుచూపుతున్నారు. వారందరికీ జగన్ కూడా భరోసా ఇచ్చినట్లు సమాచారం. నంద్యాల ఉపఎన్నిక ప‌లితం త‌ర్వాత‌నే వ‌ల‌స‌లు ఊపందుకోనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -