Friday, May 3, 2024
- Advertisement -

ఒకదానికి మోక్ష ఎయిర్‌లైన్స్‌, రెండోదానికి స్వర్గ ఎయిర్‌లైన్స్‌

- Advertisement -

పుట్టిన ప్రతి మనిషికి చావు త‌ప్ప‌దు. పుట్టిన‌ప్ప‌టినుంచి జీవితంలో శ్మాశానవాటికకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే మరణానంతరం దహనసంస్కారాలు జరిగేవి అక్కడే కాబట్టి. అయితే శ్మశాన వాటికల నిర్మాణం అన్ని ప్రాంతాల్లో దాదాపు ఒకే రీతిలో ఉంటుంది. దీన్ని వినూత్నంగా ఎందుకు నిర్మించకూడదు అనుకున్నాడు ఓ వ్యక్తి. వెంటనే తన ఆలోచనలను ఆచరణలో పెట్టాడు.
బ్ర‌తికుండ‌గా విమానాల్లో లేని వారు చ‌నిపోయిన త‌ర్వాత త‌మ కోర్కె తీర్చుకోవ‌చ్చు. ఏంచ‌క్కా విమానాల్లో స్వర్గానికో లేక న‌ర‌కానికో వెల్ల వ‌చ్చు.గుజరాత్‌లోని బర్దోలిలో ఓ వ్యక్తి వినూత్న రీతిలో శ్మశానవాటికను రూపొందించి వార్తల్లో నిలిచారు. ఎయిర్‌పోర్టును పోలి ఉండే ఈ శ్మశానవాటికలో 40 అడుగుల పొడవు కల్గిన రెండు విమానాలను ఏర్పాటుచేశారు. వాటిలో ఒకదానికి మోక్ష ఎయిర్‌లైన్స్‌, రెండోదానికి స్వర్గ ఎయిర్‌లైన్స్‌ అని నామకరణం చేశారు. విమానాశ్రయాల్లో ప్రకటనలు చేసినట్టే ఇక్కడ కూడా శవాలను ఎలా లోపలకు తీసుకెళ్లాలనే దానిపై స్పష్టమైన సంకేతాలు ఇస్తారు.
మృతదేహాలను తీసుకొచ్చిన దగ్గర నుంచి దహన సంస్కారాలు పూర్తయ్యేవరకూ.. అంతా విమానాశ్రయ వాతావరణం ఉండేలా ఏర్పాటుచేశారు. ఈ శ్మశానవాటికల్లో ఐదు దహన సంస్కార బట్టీలను ఏర్పాటు చేయగా.. వాటిలో మూడు ఎలక్రికల్‌వి కాగా, రెండు సంప్రదాయ దహన సాంస్కారాలు నిర్వహించేవిగా ఉన్నాయి.
శవాన్ని లోపల పెట్టగానే విమానాల్లో వచ్చే శబ్దం విన్పిస్తుంది.శ్మశానవాటిక అధ్యక్షుడు సోమభాయి పటేల్ కి వ‌చ్చిన ఆలోచ‌న కార‌నంగా నె ‘ఎయిర్‌పోర్టును పోలివుండే శ్మశానవాటికను నిర్మించడం నా చిన్ననాటి కల. మనిషి చనిపోయిన అనంతరం విమానాల్లో స్వర్గానికి తీసుకువెళ్తారని మా తల్లిదండ్రులు చెప్పేవారు. త్వ‌ర‌లోనె ఇది అందుబాటులోకి వ‌స్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -