Saturday, April 27, 2024
- Advertisement -

ఎక్క‌డికి పోయావు ప్ర‌దీప్‌..

- Advertisement -

యాంక‌ర్ ప్ర‌దీప్ జీవితం కొత్త సంవ‌త్స‌రం వేళ‌ ఒక్క‌సారిగా మారిపోయింది.డ్రంక్&డ్రైవ్‌లో దొరికిపోయిన ప్ర‌దీప్ ప్ర‌స్తుతం క‌నిపించ‌కుండా పోయాడు.కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీస్ నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాంకర్ ప్రదీప్ పట్టుబడి 170కి పైగా బిఎసి రీడింగ్ తో బుక్ అయిన సంగతి తెలిసిందే. తన బిఎండబ్ల్యు కారును అక్కడే వదిలేసి వెళ్ళిపోయిన ప్రదీప్ నిన్న కోర్ట్ కు హాజరు కావాల్సి ఉంది.

తల్లీదండ్రుల‌ను తీసుకుని విచ‌ర‌ణ‌కు హాజ‌రుకావ‌ల‌ని పోలిసులు ముందే సమాచారం ఇచ్చారు.నిర్ణీత స‌మ‌యానికి అత‌ను హాజ‌రు కాకపోవ‌డంతో మ‌ణికొండ‌లో ఉన్న త‌న ఇంటీకి వెళ్లిన పోలిసుల‌కు నిరాశే ఎదురైంది.ప్ర‌దీప్ ఫోన్ నంబ‌రు కూడా ప‌ని చేయ‌క‌పోవ‌డంతో ఇంక చేసేది ఏమి లేక పోలిసులు ప్ర‌దీప్ ప‌రారిలో ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ప్రదీప్ అజ్ఞాతంలో వెళ్ళడం గురించి టీవీ సర్కిల్స్ లో మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం హాట్ డిస్కషన్ జరుగుతోంది.అత‌ను బ‌య‌ట నుండే బెయిల్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు సమాచారం.అయితే ఈ కేసులో బెయిల్ వ‌చ్చే అవ‌కాశం లేదు.మ‌రి ప్ర‌దీప్ ఏం చేస్తాడో చూద్దాం! జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలియడం వల్లే ప్రదీప్ బయటికి రావడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

తను కమిట్ అయిన షోస్ షూటింగ్ ఆగిపోతుంది. వాళ్ళకు జవాబుదారిగా ఉండాల్సి వస్తుంది. చెప్పా పెట్టకుండా మానేస్తే సదరు ఛానల్ నుంచి లీగల్ నోటీసులు అందుకునే ప్రమాదం కూడా ఉంది.ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అని ప్రదీప్ ఫాన్స్ తో టీవీ మీడియా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -