Thursday, May 2, 2024
- Advertisement -

కాపు రిజ్వరేషన్స్ః పార్లమెంట్ సాక్షిగా బయటపడిన చంద్రబాబు మోసం

- Advertisement -

మొదటి సంతకమే రైతు రుణమాఫీ ఫైలుపై చేస్తానని చెప్పిన చంద్రబాబు ‘రైతు రుణమాఫీల కోసం ఓ కమిటీ వేస్తూ సంతకం చేసి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆంద్రప్రదేశ్ ప్రజలకు సూపర్ షాక్ ఇచ్చాడు. ఉచిత విద్యుత్ ఫైలుపై వైఎస్ సంతకం చేసినట్టుగానే చంద్రబాబు కూడా రైతు రుణమాఫీ ఫైలుపై సంతకం చేస్తాడని ఆశలుపెట్టుకున్న వాళ్ళను హతాశులను చేసిపడేశాడు. మొదటి సంతకంతోనే తానేంటో, తన రాజకీయం ఎలా ఉంటుందో నిరూపించుకున్న చంద్రబాబు ఇక ఇతర విషయాల్లో మాత్రం మరో విధంగా ఎందుకు చేస్తాడు?

కాపు రిజర్వేషన్స్‌పై అసెంబ్లీలో బాబు అండ్ కో చేసిన హంగామా గుర్తుందా? ఆ తర్వాత కాపులంతా కూడా చంద్రబాబుకు ఆజన్మాంతం రుణపడి ఉండాలని పచ్చ బ్యాచ్ చేసిన పబ్లిసిటీ స్టంట్స్ గుర్తున్నాయా? అప్పటికి చంద్రబాబేదో కాపు రిజర్వేషన్స్ ఇచ్చేసినట్టుగానే ఐదు శాతం కాదు పదిహేడు శాతం కదా ఇవ్వాలి అన్నట్టుగా నటనాయకుడు పవన్ చేసిన షో గుర్తుందా? బాబు సన్మానాలు, పాలాభిషేకాలు, కాపులంతా బాబుకు పాదాభివందనం చేయాలన్నంత బిల్డప్పులు…….అబ్బో పచ్చ బ్యాచ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రతిపక్షం కూడా లేని సమయం చూసి ఒక బిల్లు పాస్ చేసి కాపులకు రిజర్వేషన్స్ ఇచ్చేశాం అన్నంత బిల్డప్ ఇచ్చారు.

కట్ చేస్తే కాపులందరికీ కూడా దిమ్మ తిరిగే షాక్ ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా బయటపడింది. బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపేశాం అన్న చంద్రబాబు మాటలు ఎంతటి అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా బయటపడ్డాయి. ఇంతవరకూ కాపు రిజర్వేషన్స్‌కి సంబంధించిన ఏ సమాచారం, బిల్లు కూడా కేంద్ర ప్రభుత్వం వద్దకు రాలేదని సాక్షాత్తూ కేంద్ర మంత్రివర్యుల వారు వెల్లడించారు. అదే సభలో ఉన్న టిడిపి కేంద్రమంత్రులు, ఎంపిలు సైలెంట్‌గా జారుకున్నారు. బాబు భజన మీడియా మొత్తం కూడా ఆ వార్త ఆంద్రప్రదేశ్ ప్రజలకు చేరకుండా చాలా జాగ్రత్తలే తీసుకుంది. ఇప్పటి వరకూ ఈ విషయంపై ఒక్క టిడిపి నాయకుడు అయినా స్పందిస్తే ఒట్టు. దేశం మొత్తం కూడా రాజకీయ వ్యూహాలు, కుట్రలు పన్నే విషయంలో చంద్రబాబును మించిన రాజకీయ నాయకుడు మరొకరు లేరని అందుకే సీనియర్ మోస్ట్ రాజకీయ మేధావులు కూడా చెప్తూ ఉంటారు మరి. బాబు రాజకీయమా ? మజాకానా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -