Monday, April 29, 2024
- Advertisement -

బీసీసీఐ టాప్‌ కాంట్రాక్ట్‌నుంచి ధోనీ ఔట్‌….

- Advertisement -

దాదాపు మూడేళ్ల క్రితం టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌ బై చెప్పిన భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని..బీసీసీఐ టాప్‌ కాంట్రాక్ట్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. బీసీసీఐ పాలకుల కమిటీ తీసుకున్న నిర్ణయం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పాలిట శాపమైంది.

కొత్త కాంట్రాక్టుల‌ను భారత క్రికెటర్ల కాంట్రాక్ట్‌ సంబంధించి జాబితాను బీసీసీఐ పరిపాలకుల కమిటీని(సీఓఏ).. ఎ+, ఎ, బి, సిగా విభజించింది. ఫలితంగా ఇక్కడ అన్ని ఫార్మాట్లలో కొనసాగుతున్న ఆటగాళ్లు మాత్రమే టాప్‌ కాంట్రాక్ట్‌కు అర్హులవుతారు. జీతాలు పెంచే విషయమై కోహ్లీ, ధోనీ, శాస్త్రితో సమావేశం తర్వాత సరికొత్త ఫార్ములాకు సీవోఏ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

దీని ప్ర‌కారం ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం అన్ని ఫార్మాట్లలో కొనసాగుతున్న వారు టాప్‌ కాంట్రాక్ట్‌కు అర్హులు. అన్ని ఫార్మాట్లు ఆడుతున్న వారికి ఎ+ కాంట్రాక్ట్‌ ఇచ్చే అవకాశం ఉంది. ధోని టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో బీసీసీఐ టాప్‌ కాంట్రాక్ట్‌కు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లను సీవోఏ… ఎ+, ఎ, బి, సిగా విభజించింది. జీతాల పెంపు ప్రతిపాదనకు ముందు గ్రేడ్‌-ఎ ఆటగాడికి ఏడాదికి రూ. 2 కోట్లు.. గ్రేడ్‌-బి ఆటగాడికి రూ. కోటి.. గ్రేడ్‌-సి ఆటగాడికి రూ. 50 లక్షలు ఇస్తున్నారు. టెస్టు మ్యాచ్‌ తుది జట్టులోని వారికి రూ. 15 లక్షలు.. వన్డే తుది జట్టులోని వారికి రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్‌ తుది జట్టులోని వారికి రూ. 3 లక్షల మ్యాచ్‌ ఫీజులను బీసీసీఐ చెల్లిస్తోంది.

కొత్త నిబంధ‌న‌ల ప్రకారం అన్ని ఫార్మాట్లలో కలిపి గ్రేడ్ ఏ ఆటగాళ్లకు రూ. 5 కోట్లు ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదన ప్రకారం టెస్టు క్రికెటర్లకు అత్యధిక మొత్తం చెల్లించాలి. ఆ తరువాత వన్డేలు, టీ 20 ఆటగాళ్లు ఉండాలి. అంటే ఈ ప్రతిపాదన ఐపీఎల్ ఆడని చటేశ్వర పుజారా లాంటి క్రికెటర్ కు లాభిస్తుండగా, టెస్టు క్రికెట్ కు దూరమైన ధోనిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ధోని టాప్‌ కేటగిరిలో ఉన్నప్పటికీ కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్కే పరిమితమయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -