Saturday, May 18, 2024
- Advertisement -

త‌న‌కున్న వ్యాధిని బ‌య‌ట‌పెట్టిన రేష్మి..యాంక‌రింగ్‌నుంచి అప్పుడే త‌ప్పుకుంటా.

- Advertisement -

ఒక వైపున యాంకర్ గా బుల్లితెరపై రష్మి సందడి చేస్తూనే, మరో వైపున కథానాయికగా వెండితెరపై తన సత్తా చాటుకుంటోంది. యూత్ లో ఆమెకు విపరీతమైన క్రేజ్ వుంది. తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఆమె టచ్ లోనే ఉంటుంది.

తాజాగా ఒక అభిమాని “ఈ మధ్య ఒక ఈవెంట్ లో చీరలో మీరు చాలా లావుగా కనిపించారు. మీ తోటి వాళ్లంతా చాలా స్లిమ్ గా వుంటున్నారు. మీరు మీ శరీరాకృతిపై దృష్టిపెట్టకపోతే, కెరియర్ ప్రమాదంలో పడే అవకాశం వుంది” అనే అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు.తన అభిమాని సోషల్ మీడియాలో ఆరా తీయగా దానికి రష్మీ సమాధానం ఇచ్చారు. తన లావుకు కారణం ఓ అరుదైన వ్యాధి. అది తన బాల్యం నుంచే తనకు ఉందని అసలు విషయాన్ని బయటపెట్టారు.

“నేను బరువు పెరగడానికి కారణం నా నిర్లక్ష్యం కాదు .. ‘రుమాటిజం’ అనే ఆరోగ్య సమస్య. అందువలన బరువు పెరగడం .. తగ్గడం వంటి హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. బరువు పెరగకుండా నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఆహార నియమాలు పాటిస్తున్నాను. ఈ విషయంలో నియంత్రణ కోల్పోయిన రోజున నేను గౌరవంగా తప్పుకుంటాను” అని సమాధానమిచ్చారు.

రష్మీగారు.. ఇటీవల మీరు ఓ ఈవెంట్‌లో చీరలో కనిపించారు. అందులో మీరు చాలా లావుగా ఉన్నారు. మీరు మూడు పదుల వయసులో ఉన్నారు. కాబట్టి శరీరాకృతి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అని అభిమాని హెచ్చరించారు.లావైతే నాకు ఆఫర్లు తగ్గిపోతాయి. మీరు సూచించిన ప్రకారం నా ఆహార అలవాట్లు, తీసుకొనే ఆహారం విషయంలో జాగ్రత్త వహిస్తాను అని చెప్పారు.

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ జోడి, ఢీ 10 లాంటి ప్రజాదరణ పొందిన టెలివిజన్ రియాలిటీ షోలకు రష్మీ గౌతమ్ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా గుంటూరు టాకీస్, నెక్ట్స్ నువ్వే, అంతకు మించి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకొన్నారు.లావు పెరిగిన‌ప్పుడు యాంక‌రింగ్‌నుంచి త‌ప్పుకుంటాన‌ని సెల‌విచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -