Monday, April 29, 2024
- Advertisement -

అప్పుడు మహిషాసురుడు…ఇప్పుడు నారాసురుడు… నిప్పులు చెరిగిన జ‌గ‌న్

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో పాదయాత్ర చేస్తున్న జగన్ బొబ్బిలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబును తూర్పారబట్టారు.దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బొబ్బిలి నియోజకవర్గంలో 38వేల 150 ఇళ్లు నిర్మిస్తే చంద్రబాబు పాలనలో ఒక్క ఇళ్లు అయినా నిర్మించారా అని ప్రశ్నించారు.

రాక్షసుడు మహిషా సురుడు అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘నారా సురుడు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన మహిషాసురుడి పాలనలా ఉందని, ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ కరవుకాటకాలేనని విమర్శించారు.

పొదుపు సంఘాలకు ఒక్క రూపాయి కూడా రుణ మాఫీ చేయలేదని, రుణమాఫీ పేరిట మహిళలను దగా చేశారని ఆరోపించారు. ఈవిధంగా మోసం చేస్తున్న చంద్రబాబును ‘నారా సురుడు’ అనాలా? 420 అనాలా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఏ గడ్డి అయినా తినడానికి వెనుకాడరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఏ పార్టీతోనైనా పొత్తుపెట్టుకునేందుకు సిగ్గుపడడని మండిపడ్డారు. ఏ వ్యవస్థనైనా మేనేజ్ చెయ్యడానికి సిగ్గుపడరంటూ మండిపడ్డారు.మహిషాసరుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ అంధకారమని చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ కరువు, ప్రకృతి విపత్తులంటూ ధ్వజమెత్తారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -