Thursday, May 2, 2024
- Advertisement -

MeToo ఎఫెక్ట్‌… మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన భాజాపా నేత‌

- Advertisement -

MeToo ప్ర‌కంప‌న‌లు దేశ రాజ‌కీయాల‌ను ఓకుదుపు కుదిపేస్తున్నాయి. భాజాపా విదేశాంగ శాఖ స‌హాయ మంత్రి ఎంజే అక్బర్ పై వ‌చ్చిన లైంగిక వేధింపుల ఆరోప‌న‌లు ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్రాలుగా మారాయి. మీటూ ఆరోప‌న‌లు ఎదుర్కొంటున్న ఎంజె అక్బ‌ర్ వెంట‌నే త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు.

# మీటూ ఉద్యమంలో భాగంగా కొందరు మహిళా జర్నలిస్టులు ఎంజె అక్బర్ పై లైంగిక ఆరోపణలు చేశారు.తమపై ఎంజె అక్బర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా జర్నలిస్టులు ఆరోపించారు. ఈ ఆరోపణలను అక్బర్ తీవ్రంగా ఖండించారు. తనపై ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టులపై న్యాయ పోరాటానికి కూడ సిద్దమయ్యాడు.

తనకు విదేశాంగ సహాయ మంత్రి బాధ్యతలు కట్టబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఆయన ధన్వవాదాలు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కోర్టులో ఈ విషయాన్ని తేల్చుకొనేందుకు వీలుగా తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు.

విదేశీ పర్యటన ముగించుకొని ఆదివారం భారత్‌ తిరిగొచ్చిన అక్బర్‌ తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల సమయమే ఉందనగా.. తనపై ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవాలని అక్బర్‌ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -