Sunday, May 5, 2024
- Advertisement -

మంచి మ‌న‌స్సు చాటుకున్న యాంక‌ర్‌ సుమ‌

- Advertisement -

యాంక‌ర్ సుమ గురించి ఇప్పుడు ప్ర‌త్యేకంగా మాట్లాడుకోవాడానికి ఏం ఉంది. కేర‌ళ అమ్మాయి అయి ఉండి కూడా ఎంతో టాలెంట్‌తో తెలుగు ఇండ‌స్ట్రీలో స్టార్ యాంక‌ర్‌గా స్థిన‌ప‌డింది. ఆమె టీవీ షో లేదా ఆడియో ఫంక్షన్ ఇలా ఎక్కడైనా సరే నవ్వులు పూయించే సరదా వ్యాఖ్యత ఆమె. అయితే, ఆమెలో మరో కోణం కూడా ఉంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే చలించిపోతుంది. వారికి వెంటనే సాయం అందిస్తోంది. ఇటీవల తిత్లీ తుఫాన్ దాటికి అల్లకల్లోలమైన శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు పడుతున్న కష్టాలకు చలించిపోయింది.

ఈ సందర్భంగా కాలిగం గ్రామంలో ఇల్లు కూలిపోయి రోడ్డున పడ్డ వృద్ధ దంపతులకు ఆమె అండగా నిలిచారు. వారికి విరాళమిచ్చి వదిలేయకుండా, కూలిన ఇంటిని తిరిగి కట్టిస్తోంది. ఆ పనులను ఆమే దగ్గరుండి చూసుకుంటోంది. ఈ విషయాన్ని సుమా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. సుమ వద్ద పనిచేస్తున్న డ్రైవర్ శ్రీకాకుళం వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులు గురించి సుమకు చెప్పాడు. ఈ సందర్భంగా ఈ వృద్ధ దంపతుల కష్టాలను తెలుసుకున్న ఆమె.. వారికి ఇల్లు నిర్మించి సాయం చేయాలని నిర్ణయించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -