Monday, May 27, 2024
- Advertisement -

అత్యాచారాలు, దూషణలు, దాడులు….. ఇదేనా బాబు సారథ్యం?

- Advertisement -

తెలుగుదేశం పార్టీ అని ప్రస్తావించాల్సి వచ్చేసరికి అదేదో పరమ పవిత్రమైన సంస్కారం గల పార్టీ అనే రేంజ్‌లో పచ్చ బ్యాచ్ మొత్తం పూనకాలు వచ్చినట్టుగా చెప్పేస్తూ ఉంటారు. కానీ తెలుగు గడ్డపైన జరుగుతున్న రాజకీయాలను పరిశీలిస్తే టిడిపికంటే విలువలు లేని రాజకీయాలు చేసిన ఇతర పార్టీలు ఏవీ కనిపించవు. పరిటాల రవి హత్యలో ప్రధాన ముద్దాయి అన్న జేసీ దివాకరరెడ్డితో ఆ కుటుంబ సభ్యులతో పాటు దేశమంతా తిరిగి నానాయాగీ చేసిన చంద్రబాబు ఇప్పుడు అత్యంత సన్నిహితంగా ఎలా ఉండగలుగుతున్నారో పచ్చ జనాలే చెప్పాలి? ఇక తెలుగు ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోయే వెన్నుపోటు చరిత్ర గురించి చెప్పనవసరం లేదు. 2009లో చంద్రబాబును గెలిపించడం కోసం ప్రాణాలకు తెగించి ప్రచారం చేసిన ఎన్టీఆర్‌ని బాబు, లోకేష్‌లు ఏ స్థాయిలో హింసిస్తున్నారో చెప్పనవసరం లేదు. ఇక చెప్పులతో దాడులు, ఘర్షణలు, గొడవలు, కమిషన్ల దందాలు, కులం పేరుతో గొడవలు…… అన్నింటా టిడిపి నాయకులే కనిపిస్తున్నారు.

బెజవాడ సెక్స్ స్కాంలో, కాల్ మనీ స్కాంలో టిడిపి నేతలు అడ్డంగా దొరికిన వైనం ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు వరుసగా మైనర్ బాలికలపై అత్యాచారాలు, అఘాయిత్యాల సంఘటనల్లో వరుసగా టిడిపి నేతలు దొరికిపోతున్నారు.దాచేపల్లి ఘటన తర్వాత ఇంకొక్క ఘటన జరిగినా ఊరుకోను అని చంద్రబాబు డప్పాలు కొట్టాడు. కానీ అదే దాచేపల్లిలో అదే చంద్రబాబుగారి పార్టీ నాయకుడు షేక్ మాబువలి 12 ఏళ్ళ బాలికను గర్భవతిని చేశాడు. తల్లిలేని బాలికపై అఘాయిత్యానికి పాల్పడి……అధికార పార్టీ నాయకుడినని……విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని ఆ బాలికతో పాటు ఆ బాలిక బంధువులను కూడా బెదిరించాడు. అయితే ఆ అమ్మాయి గర్భవతి కావడంతో అసలు విషయం బయటపడింది. ఈ మాబువలి 2013లో ఎంపిటిసీ ఎన్నికల్లో టిడిపి తరపున పొటీ చేసి వైకాపా నేత చేతిలో ఓడిపోయాడు. టిడిపి అధికారంలోకి రాగానే అతన్ని మండల పరిషత్‌లో కో ఆప్షన్ సభ్యుడిగా నియమించారు చంద్రబాబు. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడితే ఉరే అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఈ టిడిపి నాయకుడిని కూడా శిక్షిస్తాడా? లేకపోతే అతనిని కాపాడి ఇతర టిడిపి నాయకులకు కూడా ఎంకరేజ్‌మెంట్ ఇస్తాడా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -