Saturday, May 4, 2024
- Advertisement -

పంజాబ్ పోరాటం వృధా…ప్లేఆఫ్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకున్న కేకేఆర్‌

- Advertisement -

ఐపీఎల్ 2018 సీజన్‌లో భాంగంగా కేకేఆర్‌, పంజాబ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ప‌రుగులు వ‌ద‌ర పారింది. ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సంచలన విజయాన్ని న‌మోదు చేసింది. ఇండోర్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరైన్ (75: 36 బంతుల్లో 9×4, 4×6), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (50: 23 బంతుల్లో 5×4, 3×6) మెరుపులు మెరిపించడంతో తొలుత 245 పరుగుల భారీ స్కోరు చేసిన కోల్‌కతా జట్టు అనంతరం పంజాబ్‌ను 214/8కే పరిమితం చేసింది.

భారీ లక్ష్య ఛేదన‌లో పంజాబ్ ఓపెనర్ లోకేశ్ రాహుల్ (66: 29 బంతుల్లో 2×4, 7×6), రవిచంద్రన్ అశ్విన్ (45: 22 బంతుల్లో 4×4, 3×6) ,అరోన్ ఫించ్ (34: 20 బంతుల్లో 3×6) కాసేపు కంగారుపెట్టినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ ఫెయిలవడంతో కోల్‌కతా గెలుపు లాంఛనమైంది. క్రిస్‌గేల్ (21), మయాంక్ అగర్వాల్ (0), కరుణ్ నాయర్ (3) ఓవర్ల వ్యవధిలో వికెట్ చేజార్చుకోవడం‌ మ్యాచ్‌లో కీలక మలుపు. టోర్నీలో కోల్‌కతా‌కి ఇది ఆరో గెలుపుకాగా.. పంజాబ్‌కి ఐదో ఓటమి. కేకేఆర్‌ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్‌ మూడు వికెట్లు సాధించగా, నరైన్‌, ప్రసిధ్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌, సీర్లెస్‌లు తలో వికెట్‌ తీశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -