Tuesday, May 7, 2024
- Advertisement -

బిజెపి గెలుపు ఖాయం…… బాబులో దడ దడ మొదలు: రాధాకృష్ణ

- Advertisement -

రాజకీయాలను శతృత్వం స్థాయికి దిగజార్చిన ఘనత చంద్రబాబు అండ్ బ్యాచ్‌దే అని చెప్పడానికి సందేహం అక్కర్లేదు. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచాక ఎన్టీఆర్‌పై అనైతిక, అమానవీయ రాతలతో ఎన్టీఆర్‌తో పాటు ఆయన అభిమానులను కూడా హింసించారు. సొంత మామ విషయంలోనే పదవీ స్వార్థంతో ఆ స్థాయిలో విలువలకు తిలోదకాలిచ్చిన బాబు అండ్ బ్యాచ్ ఇక వైఎస్‌ల విషయంలో దిగజారుడుకు పరాకాష్ట అనేస్థాయికి వెళ్ళారు. వైఎస్ ఇంటి మహిళలపై కూడా దారుణమైన ప్రచారం చేశార. అదీ బాబుతో పాటు ఆయన భజన మీడియా తీరు. 2014 విభజన ముందు వరకూ కాంగ్రెస్‌తో అంటకాగి జగన్‌ని హింసించి ఆ వెంటనే ప్లేట్ ఫిరాయించి మోడీ మద్దతుదారుల ఓట్ల కోసం మోడీకి జై కొట్టాడు. ఇక ఇప్పుడు మోడీని అతిపెద్ద విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మొత్తం పరిణామంలో ఎక్కడా కూడా ప్రజా ప్రయోజనాలు అన్న మాటేలేదు. అన్నీ కూడా బాబు అధికార స్వార్థ ప్రయోజనాలే.

2019 ఎన్నికల్లో మోడీ గెలిచే అవకాశమే లేదు అని భావించాడు చంద్రబాబు. మోడీ హవా ప్రజల్లో అస్సలు లేదని భావించి…….మోడీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే ఓడిపోతానని భయపడి పొత్తుకు రాం రాం చెప్పేశాడు. అయితే అంతటితో ఆగితే బాబు ఎందుకవుతాడు? మోడీని అతిపెద్ద విలన్‌ని చేయాలనుకున్నాడు. తన వైఫల్యాలు అన్నింటినీ మోడీ అకౌంట్‌లో వేయాలనుకున్నాడు. అలాంటి విలన్‌తో తాను పోరాడుతున్నాను అన్న బిల్డప్ ఇవ్వాలనుకున్నాడు. అమిత్ షాపై రాళ్ళదాడితో సహా ఎన్నో వ్యూహాలు పన్నాడు. అయితే కర్ణాటక ఎన్నికలు అవగానే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ బాబును షాక్‌కి గురిచేస్తున్నాయి. టిడిపిలో భయాందోళనలు పెంచుతున్నాయి. ఆ భయం మొత్తం ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ వీకెండ్ కామెంట్‌లో కనిపించింది. అంతా కూడా మోడీ విలన్….. మోడీనే చంద్రబాబుతో ఆయన మద్దతుదారులతో పాటు తనను కూడా ఏదో చేయబోతున్నాడు, చేయాలని అనుకుంటున్నాడు అన్న రేంజ్‌లో రాసుకుంటూపోయాడు రాధాకృష్ణ. అయితే రాధాకృష్ణ రాతల్లో చదివినవాళ్ళకు అర్థమవుతున్న విషయం మాత్రం ఒక్కటే. కర్ణాటకలో మోడీ గెలుపు ఖాయం. ఆ తర్వాత మోడీ, అమిత్ షా విషయంలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుతో పాటు ఆయన మద్దతుదారుల తప్పులన్నింటినీ బయటపెట్టి శిక్షలు పడేలా చేయడం ఖాయం. ఆ లిస్టులో తాను కూడా ఉంటానేమో అన్న భయం రాధాకృష్ణ రాతల్లో కనిపిస్తోంది. ఇక చంద్రబాబు, లోకేష్‌లు కూడా ఎక్కడ బుక్కవుతారో అన్న టెన్షన్ టిడిపి నేతల్లో కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -