Sunday, June 2, 2024
- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యంలో మంత్రి నారాయ‌ణ‌కు ఊహించ‌ని షాక్‌…

- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యంలో మంత్రి నారాయ‌ణ‌కు నెల్లూరులో బిగ్ షాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్యే అనీల్‌ను ఎలాగైనా ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న నారాయ‌ణ‌కు సొంత బంధువే ఊహించని షాక్ ఇచ్చారు. మంత్రి తోడల్లుడు రామ్మోహన్‌తో పాటు పలువురు అనుచరులు టీడీపీని వీడి… వైసీపీలో చేరారు. నెల్లూరు జిల్లాలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ నేతలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, అనిల్ కుమార్ ల సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. చేరిక సంద‌ర్భంగా ఆదాల ప్ర‌భాక‌ర్ నారాయ‌ణ‌పై నిప్పులు చెరిగారు. నెల్లూరు నగరాన్ని రూ.5 వేల కోట్లతో అభివృద్ధి చేశామని చెబుతున్న మంత్రి నారాయణ… డబ్బుతో ఓట్లు ఎందుకు కొంటున్నారని ఆదాల ప్ర‌శ్నంచారు. గెలుపు కోసం నారాయ‌ణ అడ్డ‌దారులు తొక్కుతున్న‌రనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్నికల సమయంలో నారాయణ తన విద్యాసంస్థలకు చెందిన ఉద్యోగులతో సర్వేలు చేయించటంతో పాటు వారితో ఓటర్లకు నగదు చేరవేస్తూ ప‌ట్టుబ‌డిన సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -