ఎగ్జిల్ పోల్స్ తోనే టీడీపీ కూటమికి బొమ్మ కనబడటం ఖాయమనన్నారు మంత్రి జోగి రమేష్. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రమేష్…చంద్రబాబు విదేశీ పర్యటనపై చురకలు అంటించారు. ఎన్నికల్లో దోచుకున్న డబ్బులు దాచుకోడానికే చంద్రబాబు విదేశాలకు వెళ్లారని…అందుకే ఆయన ఎక్కడికి వెళ్లారనేది రహాస్యంగా ఉంచారన్నారు.
జూన్ 4న చంద్రబాబుకి మూర్చ వచ్చి హాస్పిటల్ లో చేరడం ఖాయమని…ఎగ్జిట్ పోల్స్ తమకే అనుకూలమన్నారు. ఏబీ వెంకటేశ్వరావు టీడీపీ తొత్తుగా వ్యవహరించారనేది అర్దమై పోయిందన్నారు. పరికరాల కొనుగోలు స్కాంలో కేంద్ర నిఘా వ్యవస్థ కూడా ఆయన పాత్ర ఉందని నిర్ధారించిందని…వెంకటేశ్వరరావు ఒంటిపై ఉన్నదది మాత్రమే ఖాకీ బట్టలు…లోపల అంతా యెల్లోనే అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు సువర్ణ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నారని…మరో ఐదు సంవత్సరాలు ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఖాయమని మంత్రి కాకాణి తెలిపారు. అందుకే తిరుమలకు వచ్చానని చెప్పారు.
