Thursday, May 2, 2024
- Advertisement -

వైఎస్ జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌ర్‌ప్రైజ్‌

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు, జ‌గ‌న్ ఎప్పుడూ ఉప్పు నిప్పు మాదిరి చిట‌ప‌ట‌లాడుతుంటారు. పొద్దునే లేస్తే చంద్ర‌బాబును జ‌గ‌న్ తిట్ట‌డం ప‌ని పెట్టుకుంటారు. చంద్ర‌బాబు కూడా త‌మ పార్టీ నాయ‌కులు, తాను జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అలాంటి చంద్ర‌బాబు నాయుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపి అంద‌రికీ షాక్కిచ్చారు. అత‌డి శుభాకాంక్ష‌ల‌ను జ‌గ‌న్‌ను కూడా స‌ర్‌ప్రైజ్ అండి.. అంటూ థ్యాంక్స్ చెప్పారు.

ఈ విధంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జగ‌న్‌కు గురువారం (డిసెంబ‌ర్ 21) ట్విట్ట‌ర్‌లో జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. గాడ్ బ్లెస్ యూ, సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాల‌ని చంద్ర‌బాబు నాయుడు ఆకాంక్షించారు. దీనికి జ‌గ‌న్ స్పందిస్తూ ప్లెసెంట్‌ స‌ర్‌ప్రైజ్ అండి. థ్యాంక్స్ అని జ‌గ‌న్ బ‌దులిచ్చారు.

వైఎస్ కుటుంబంతో చంద్ర‌బాబుకు ఎప్ప‌టినుంచో మంచి సంబంధం ఉండేది. రాజ‌కీయంగా పోరు కొన‌సాగుతున్నా నారా, వైఎస్ కుటుంబానికి మంచి సంబంధాల ఉన్నాయి. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి చంద్ర‌బాబు నాయుడు మంచి మిత్రుడు. వీరి శుభాకాంక్ష‌ల‌తో మ‌ళ్లీ వైఎస్సార్ నాటి కాలం గుర్తుకు వ‌చ్చింది. రాజ‌కీయాలు వేరు వ్య‌క్తిగ‌త జీవితాలు వేరు అని ఇద్ద‌రు నాయ‌కులు నిరూపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -