Thursday, May 2, 2024
- Advertisement -

పోలీసుల‌పై టీడీపీ తాడిప‌త్రి ఎమ్మెల్యే చిందులు

- Advertisement -

పోలీసులపై తెలుగ‌దేశం పార్టీ ఎమ్మెల్యే చిందులు వేశాడు. పోలీస్‌స్టేష‌న్‌లో ర‌చ్చ‌ర‌చ్చ చేశాడు. బాధ్య‌త గ‌ల పోలీసుల‌పై తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. పోలీసుల‌పై గౌర‌వం లేకుండా ప్ర‌వ‌ర్తించారు. దీనికంత‌టికీ వేదిక‌గా తాడిప‌త్రి పోలీస్‌స్టేష‌న్ నిలిచింది. ఓ కార్య‌క‌ర్త‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌ని చెప్పి పోలీస్‌స్టేష‌న్‌లో నానా ర‌భ‌స చేశాడు.

అనంతపురం మేయర్ స్వరూప ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మండిప‌డుతూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ విమ‌ర్శించారు. జేసీ దివాక‌ర్ రెడ్డిని తిడుతూ ఆయ‌న‌పై మండిప‌డ్డారు. ఈ విష‌య‌మై టీడీపీ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు మడ్డిపల్లి శివ మేయ‌ర్‌ స్వరూపతో పాటు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి ఫోన్‌లో బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఫోన్ ఇద్ద‌రినీ చెడామాడ తిట్ట‌డంతో క‌ల‌త చెందిన మేయ‌ర్ స్వరూప పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు మేర‌కు పోలీసులు వెంటనే శివను అదుపులోకి తీసుకున్నారు. కార్య‌క‌ర్తను అదుపులోకి తీసుకున్నార‌నే విషయం తెలియగానే ఎంపీ సోద‌రుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి రంగంలోకి దిగి ర‌చ్చ‌ర‌చ్చ చేశాడు. నేరుగా పోలీస్‌స్టేషన్ కు వెళ్లి బండ బూతులు అందుకున్నాడు. కనిపించిన పోలీసులందరినీ తిట్టటం మొదలుపెట్టారు. అత‌డి వీరంగం చూసి పోలీసులు భయపడిపోయారు. వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి శివను బయటకు తీసుకెళ్లాడు. తీసుకెళ్లినంత వ‌ర‌కు బాగానే ఉన్నా త‌ర్వాత మేయర్ డ్రైవర్ జేసీ సోదరులను తిట్టారని అతడిని అరెస్టు చేయాల‌ని జేసీ అనుచ‌రులు డిమాండ్ చేశారు. కొద్దిసేపు ఆందోళ‌న చేసి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల‌పై ఇలా ప్ర‌వ‌ర్తించ‌డంపై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ఎమ్మెల్యే ఇలా ప్ర‌వ‌ర్తిస్తారా అని నిల‌దీస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -