Monday, May 20, 2024
- Advertisement -

రోజా vs బాబు – చంద్రబాబు ఇగో వల్లనే ఇదంతా !

- Advertisement -

ప్రస్తుతం రాష్ట్రంలో అందరూ రోజా సస్పెన్షన్ విషయం గురించి కాకుండా దేని గురించీ చర్చించడం లేదు. గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ తెచ్చుకున్నారు అధికార పక్షం వారు అని అందరూ వారినే అంటున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు అంతగా రోజా మీద మనసు పెట్టాల్సిన పని లేదు. ఆమె అసంబ్లీ లో మాటలాడితే ఇదివరకు లాగానే సమాధానం చెప్పేస్తే ఓడిలిపోయేది కానీ ఇప్పుడు పరిస్థితి పంతం తో ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. వరసగా రెండు రోజుల పాటు రోజా ని అసెంబ్లీ లోకి రానివ్వకుండా చేసిన అధికార పక్షం వారు ఇప్పుడు ఆమె మీద కోర్టుకు ఎక్కి లేని పోనీ లాజిక్ లన్నీ మిస్ అయ్యారు.

ఆమెని సస్పెండ్ చేసి చాలా కాలం అయ్యింది , జనాలు కూడా ఆ విషయం మరచిపోయారు, ఆమె కోర్టుకి వెళ్ళడం అక్కడ ఆమెకి ఊరట లభించడం అవన్నీ జరిగినా సైలెంట్ గా ఉంటూ ఏం జరుగుతుందో చూసి కోర్టు ద్వారా ప్రొసీడ్ అయితే బాగుండేది కానీ పోలీసులతో , మార్షల్స్ తో ఆమెని ఆపించి జనాల దగ్గర ‘ అధికార పార్టీ కోర్టు ఉత్తర్వులకి కూడా విలువ ఇవ్వదు ‘ అనిపించుకున్నారు చంద్రబాబు వర్గీయులు. లేనిపోని విధంగా రోజా లాంటి సాధారణ ఎమ్మెల్యే ని రాత్రికి రాత్రి లేడీ హీరోని చేసి పారేసారు. 

మొన్నటి దాకా జగన్ vs చంద్రబాబు గా ఉండగా , రోజా ని స్వయంగా ఒక మెట్టు ఎక్కించ రోజా vs చంద్రబాబు చేసారు. ఈ లెక్కలో చూస్తే చంద్రబాబు ఈగో, అహంకారమే పరిస్థితి ఇంతదాకా తీసుకొచ్చింది అని చెప్పాలి. కోర్టుల ద్వారా ప్రొసీడ్ అవ్వక ఆమె గొంతు నొక్కాలి అని ప్రయత్నించి విఫలం అవడమే కాక జనం దగ్గర పరువు పోగొట్టుకున్నారు బాబు గారు. ఏదో ఆవేశంలో చేసిన స‌స్పెన్ష‌న్ ఇప్పుడు ఏకంగా పార్టీ మెడ‌కే చుట్టుకుంద‌న్న భావ‌న స‌ర్వ‌త్రా వ్యక్తం అవుతోంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -